
నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే మన రాముడు.. కృష్ణావతారం ఎత్తాడు. రాధ మరెవ్వరో కాదు.. ఆయన ఎంతో ఇష్టపడే శ్రీదేవి. అదేంటీ! కొంపదీసి శ్రీదేవి బయోపిక్‌లో నటిస్తున్నాడా? అని కంగారు పడుతున్నారా? డోన్ట్ వర్రీ, నేపథ్యంలో వర్మ అభిమాని తయారు చేసిన ఓ చిలిపి వీడియోలో కృష్ణుడిలా ప్రత్యక్షమయ్యాడు. కృష్ణుడు అవతారంలో ఉన్న ఆర్జీవీ ఫ్లూట్ ఊదుతుంటే.. నీళ్ల కుండతో శ్రీదేవి ఆయన పక్కన నిలుచున్నట్లుగా రూపొందించిన చిత్రంతో ఈ వీడియోను రూపొందించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో జామురాతిరి జాబిలమ్మ పాట వస్తుండగా.. శ్రీదేవి డైలాగులు వినిపిస్తాయి. ‘‘మానవ నిన్నే మానవా?’’ అనే డైలాగ్‌తో ఆర్జీవీ మాటలను ఎడిట్ చేసి ఈ వీడియో రూపొందించారు. ‘‘దమ్ము కొట్టడం, రమ్ము కొట్టడం.. సిగ్గులేదు’’ అనే శ్రీదేవి డైలాగ్‌కు ‘‘అరవటం ఆగకపోతే ఇరగ్గొడతా’’ అనే ఆర్జీవీ డైలాగ్‌ను కలిపారు. చివరిగా ‘‘మానవా.. ఐ లైక్ యూ’’ డైలాగ్‌తో ఈ వీడియో ముగిసింది. అయితే, ఈ వీడియోను మాటల్లో చెప్పడం కంటే చూస్తేనే నచ్చుతుంది. వర్మ ట్వీట్ చేసిన వీడియో: అయితే, వర్మ ట్వీట్ చేశారంటే.. ఆయన అభిమానులే సెటైర్లు వేసి సంతోష పెడతారు. ఈ వీడియోకు కూడా కొందరు తమ కామెంట్లతో వర్మను ట్రోల్ చేశారు. కొందరు ‘‘వర్మాష్టమి శుభాకాంక్షలు’’ అని చెబితే.. ఇంకొందరు ‘‘చంద్రయాన్-2 సక్సెస్ చేయగలిగారు గానీ.. ఈయన పైత్యం తగ్గడానికి మందు కనిపెట్టలేపోయారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఏమన్నారో ఈ కింది ట్వీట్లలో చూడండి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MAnMmY
No comments:
Post a Comment