Wednesday, 21 August 2019

Saaho Movie Showtimes: ‘సాహో’ ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్.. ఎప్పటి నుంచి, ఆఫర్లేంటి?

రెబల్ స్టార్ హీరోగా నటించిన అత్యంత భారీ చిత్రం ‘సాహో’. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ‘సాహో’ను పిలుస్తున్నారు. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఇంకా.. నీల్ నితిన్ ముఖేశ్, జాకీష్రాఫ్, అరుణ్ విజ‌య్‌, లాల్‌, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేకర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా వంటి బాలీవుడ్, కోలీవుడ్ స్టార్లతో పాటు వెన్నెల కిషోర్‌ ‘సాహో’ చిత్రంలో నటించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక ప్రత్యేక గీతంలో నర్తించింది. ‘బాహుబలి’ సినిమా తరవాత ప్రభాస్ హీరోగా వస్తోన్న సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ‘సాహో’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేక్షకుల అంచనాలకు ఎక్కడా తగ్గకుండా హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. దర్శకుడు సుజీత్ తన రెండో సినిమానే ఈ స్థాయిలో మలచడం నిజంగా ప్రశంసనీయం. దీనికి తోడు జిబ్రాన్ నేపథ్య సంగీతం, మధి సినిమాటోగ్రపీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి. యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్, వంశీ, విక్రమ్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి ప్రభాస్ అభిమానులు ఉబలాటపడుతున్నారు. కానీ, అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ఓపెన్ కాలేదు. సినిమా ఇంకా సెన్సార్‌కు కూడా వెళ్లలేదు. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసి టిక్కెట్లను అందుబాటులోకి తెస్తారు. ‘‘బుక్ మై షో, పేటీఎం, జస్ట్ టిక్కెట్, టిక్కెట్ న్యూ’’ వంటి యాప్‌లలో ‘సాహో’ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఉదయం 8.45 గంటలకు ఫస్ట్ షో ఉంటుంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో టిక్కెట్ బుకింగ్, షో టైమింగ్స్, టిక్కెట్ బుకింగ్‌పై ఆఫర్లు వంటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TQKpVb

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....