Saturday, 3 August 2019

Nagarjuna: అమల, సమంతలను పంపు.. నాగార్జునపై నోరు పారేసుకున్న శ్వేతారెడ్డి

బిగ్ బాస్ హౌస్‌లో టాస్క్‌ల పేరుతో కంటెస్టెంట్స్ మానసిక స్థితితో ఆడుకుంటున్నారంటూ మరోసారి ఫైర్ అయ్యింది కాంట్రవర్శీ యాంకర్ శ్వేతా రెడ్డి. బిగ్ బాస్ సీజన్‌ 3 కంటెస్టెంట్‌గా ప్రయత్నించి భంగపడ్డ .. తరచూ సంచలన కామెంట్స్‌తో వార్తల్లోకి వస్తున్నారు. బిగ్ బాస్ ఆడిషన్స్‌లో భాగంగా తనను సెక్సువల్ ఫేవర్‌గా ఉండమని కోరారంటూ సంచలన ఆరోపణలు చేసిన శ్వేతారెడ్డి.. ఢిల్లీ స్థాయిలో తన నిరసన చేపట్టారు. ఇక బిగ్ బాస్ గత నెల 21 ప్రారంభమై రెండు వారాలను కంప్లీట్ చేస్తున్న తరుణంలో మరోసారి మీడియా ముందుకు వచ్చి.. హోస్ట్ నాగార్జునపై వ్యక్తిగత దూషణకు దిగింది. అంతేకాదు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ను పశువుల్లా ట్రీట్ చేస్తున్నారంటూ మండిపండింది శ్వేతారెడ్డి. శుక్రవారం నాడు హైదరాబాద్ ప్రెస్‌ క్లబ్‌లో బిగ్ బాస్ రియాలిటీ షోని వ్యతిరేకించే కొంత మంది వ్యక్తులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన శ్వేతా రెడ్డి నాగార్జునపై సంచలన కామెంట్స్ చేసింది. టాస్క్‌ల పేరుతో కంటెస్టెంట్స్ సైకిలాజికల్ స్టేటస్‌తో ఆడుకుంటున్న బిగ్ బాస్‌ను ప్రశ్నించే బాధ్యత తనపై ఉందని అందుకు ఈ ప్రెస్ మీట్ నిర్వహించానన్నారు శ్వేతా రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న 15 మంది కంటెస్టెంట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఆడుకుంటున్నారు. వాళ్లను మానసికంగా హింసిస్తున్నారు. జంతువలపై ఏదైనా ప్రయోగం చేయాలంటేనే అది చట్ట విరుద్ధం అంటున్నారు. ఇప్పుడు 15 మంది ఓ ఇంటిలో బంధించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారా? గారూ. దీన్ని వినోదం అంటారా? అయితే అమలను బిగ్ బాస్ హౌస్‌ లోపలికి పంపించండి. సమంతని పంపించండి. అలాచేస్తే బిగ్ బాస్ ఇమేజ్ పెరుగుతుంది కదా.. మీకో నాలుగు కోట్లు.. అమలకు నాలుగు కోట్లు.. సమంతకు గంటకు నాలుగు కోట్లు ఇస్తారు కదా.. వాళ్లను లోపలికి పంపిన తరువాత ఆ పైశాచిక ఆనందం రుచి చూడండి. అలా మీరు చూడగలరా? ఆ ధైర్యం మీరు చేయగలరా? మన్మథుడు 2 ట్రైలర్ ప్రమోషన్స్ అంటూ వస్తున్నారే.. మేం ఇంతిలా పోరాటం చేస్తుంటే స్పందించకుండా.. 60 ఏళ్లు వచ్చిన తరువాత కూడా లిప్ లాక్‌ల గురించి ప్రమోట్ చేసుకుంటున్నారు. పైగా పోరాటం చేసే వాళ్లను గాలిబుడగలు అంటారా? ఎవరివి గాలి బుడగలు? సమాజానికి సేవ చేయాలని నా సొంత ఖర్చులు పెట్టుకుని పోరాటం చేస్తుంటే మేం గాలి వాళ్లం అయ్యామా? మీ వాళ్లు తప్పుచేయకపోతే ముందే ఎందుకు బెయిల్‌కి అప్లై చేస్తారు? మీరు ఎదవల్ని కాపాడుతున్నారు. ఎప్పుడూ బిజినెస్ మైండ్‌తో తప్ప సమాజానికి ఏమైనా చేయాలని మీ కుటుంబానికి ఉండదా? కోట్లు కోట్లు సంపాదించి ఏం చేస్తారు? ఎంతోకొంత సామాజిక బాధ్యత ఉండాలి కదా? మీరు ఇలాగే నా ఉద్యమాన్ని గాలిబుడగలు అని తీసిపారేస్తూ ఉండండి.. ఇది ఎంతలా తీవ్రరూపం దాల్చుతుందో చేసి చూపిస్తా’ అంటూ వార్నింగ్ ఇచ్చింది శ్వేతారెడ్డి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Yor1UP

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....