Sunday, 4 August 2019

Friendship Day: చరణ్‌తో స్నేహం.. ఇంతకు మించి మరేది..: ఎన్టీఆర్

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా సెలబ్రిటీలు మొదలుకొని సామాన్యుల వరకు ఫ్రెండ్ ఉన్న ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. మిత్రుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ రామ్‌చరణ్ మంచి మిత్రులనే సంగతి తెలిసిందే. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ కథానాయకులిద్దరూ సోషల్ మీడియా ద్వారా తమ స్నేహాన్ని చాటుకున్నారు. రామ్ చరణ్‌తో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ‘‘మెల్లగా స్నేహాన్ని ప్రారంభించండి.. కానీ స్నేహితులుగా మారాక దాన్ని నిరంతరం కొనసాగించండి’’ అన్న సోక్రటీస్ సూక్తిని పోస్ట్ చేశారు. మా స్నేహాన్ని ఇంతకు మించి మరే సూక్తి కూడా నిర్వచించలేదని రామ్‌చరణ్‌తో తన స్నేహాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనికి #RRRYehDosti అనే హ్యాష్‌ట్యాగ్ జతచేశారు. కూడా ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. కొన్ని బంధాలు బలపడటానికి సమయం పడుతుంది. కానీ ఒక్కసారి బంధం ఏర్పడ్డాక జీవితాంతం కొనసాగుతాయి. అలాంటి బంధమే తారక్‌తో నాకు ఏర్పడింది. నా భీమ్ అని చరణ్ పోస్ట్ చేశాడు. ఆయన కూడా #RRRYehDosti హ్యాష్ ట్యాగ్ జత చేశారు. రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో కలిసి నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రక చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కూడా ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు తెలిపింది. 1920ల్లో మా రామరాజు, భీమ్ అనుకోకుండా కలిశారు. టైంతోపాటు వారి స్నేహం బలపడింది. మీ రామరాజు/భీమ్ ఎవరు? మీ బెస్ట్ ఫ్రెండ్‌ ఫొటోను లేదా తనతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసి మీ ప్రియ మిత్రుడికి శుభాకాంక్షలు చెప్పండని ట్వీట్ చేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YL5KUA

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....