Tuesday, 6 August 2019

సమంత సినిమా చూసిన గవర్నర్ నరసింహన్

గవర్నర్ నరసింహన్ నటించిన ఓ బేబీ మూవీని వీక్షించారు. న‌ర‌సింహ‌న్ కుటుంబంతో క‌లిసి స్పెష‌ల్ స్క్రీనింగ్ చూశారు. సినిమా చాలా బావుందంటూ యూనిట్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. స్పెష‌ల్ స్క్రీనింగ్‌కి గ‌వ‌ర్న‌ర్‌తో పాటు దర్శకురాలు నందిని రెడ్డి, చిత్ర బృందం కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సినిమా యూనిట్ పంచుకుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో నాగ‌శౌర్య‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ బేబీ సినిమా విడుదలయ్యింది. సమంత తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. మూవీ కూడా మంచి హిట్ టాక్‌ తెచ్చుకుంది. కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీ చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కింది. 70 ఏళ్ల వృద్దురాలు తిరిగి య‌వ్వ‌నంలోకి వ‌స్తే ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు. హిందీలోనూ త్వరలో ఈ సినిమా రీమేక్ కాబోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KiV2ga

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....