Monday, 5 August 2019

‘సాహో’ విడుదల తర్వాత ప్రభాస్ పెళ్లి ప్రకటన!

రెబల్ స్టార్ ‘సాహో’ సినిమాతో సిద్ధంగా ఉన్నారు. ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 30న ఈ యాక్షన్ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా విడుదల తరవాత ప్రభాస్ పెళ్లి ప్రకటన రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత రెండు రోజులుగా ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రభాస్ పెళ్లి అంశంపై ఇప్పటికే బోలెడన్ని వార్తలు వచ్చాయి. గడిచిన మూడేళ్ల నుంచి ప్రభాస్ కోసం అమ్మాయిని వెతికే పనిలో కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు సైతం త్వరలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని గతంలో స్పష్టం చేశారు. అయితే, పెద్దలు ప్రభాస్ కోసం తాజాగా ఒక అమ్మాయిని చూసినట్టు తెలుస్తోంది. Also Read: ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం అమెరికాలో స్థిరపడిన ఒక వ్యాపారవేత్త కుమార్తెను ప్రభాస్ పెళ్లిచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ కుటుంబ సభ్యులు అమ్మాయిని చూశారట. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని, ఈ సంబంధం గనుక ఖరారైతే ‘సాహో’ విడుదల తర్వాత పెళ్లి వార్తను అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే, అనుష్కతో ప్రభాస్ డేటింగ్‌లో ఉన్నారంటూ ఇప్పటికే బోలెడన్ని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారని కూడా అన్నారు. వీరిద్దరూ కలిసి ఏ వేడుకకు వెళ్లినా పెళ్లి వార్త ఆటోమేటిక్‌గా వైరల్ అయిపోతుంది. కానీ, ఈ వార్తలను ఇప్పటికే చాలాసార్లు ప్రభాస్, అనుష్క ఖండించారు. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OINSpL

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....