అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్ష్ థ్రిల్లర్ ‘ఎవరు’. వెంకట్ రామ్‌జీ దర్శకత్వం వహించారు. ఈయనకు ఇదే తొలి చిత్రం. పీవీపీ సినిమా బ్యానర్‌పై పెర్ల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కావిన్ అన్నె నిర్మించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో సినిమాపై అంచనాలను పెంచేందుకు ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘‘ప్రతి కథ వెనుక ఒక రహస్యం ఉంటుంది’’ అనే అంతరార్థంతో ఈ సినిమా కథ రాసుకున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సినిమాలో సబ్ ఇన్‌స్పెక్టర్ విక్రమ్ వాసుదేవ్‌గా కనిపించనున్నారు. రెజీనా ఒక వ్యక్తిని చంపేస్తుంది. కానీ, అతనెవరో అంతుపట్టని విషయం. ఒకబ్బాయేమో మా నాన్న మూడు రోజుల నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాడు. అయితే, ఈ మిస్సింగ్ కేసుకి, రెజీనా చంపేసిన వ్యక్తికి ఏదో సంబంధం ఉంది. ఆ రహస్యం తెలియాలంటే ‘ఎవరు’ సినిమా చూడాల్సిందే. అడివి శేష్ తెలుగు ప్రేక్షకులకు మరో అదిరిపోయే థ్రిల్లర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం రోజున చూపించబోతున్నారు. టాలీవుడ్‌లో మంచి ప్రతిభ కలిగిన నేటి తరం నటుల్లో అడివి శేష్ ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్‌గా, దర్శకుడిగా శేష్ రాణిస్తున్నారు. కేవలం హీరో పాత్రలే కాకుండా సహాయక నటుడిగా, విలన్ పాత్రలు చేస్తూ అడివి శేష్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 2016లో వచ్చిన ‘క్షణం’, కిందటేడాది విడుదలైన ‘గూఢచారి’ సినిమాలు అడివి శేష్‌కు మంచి ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది ‘ఎవరు’ సినిమాతో మెప్పించబోతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2yCiL4b
No comments:
Post a Comment