Friday, 23 August 2019

విశాల్, అనీశా పెళ్లి ఆగిపోయిందా.. కారణం ఇదేనా?

సినీ హీరో, నిర్మాత విశాల్‌కు హైదరాబాద్‌కు చెందిన నటి అనీశా రెడ్డితో ఐదు నెలల క్రితం నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 10న వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు పెళ్లి తేదీని కూడా ప్రకటించారు. అక్టోబర్ 9న వీరిద్దరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, ఈ పెళ్లి ఆగిపోయిందనే వార్త ప్రస్తుతం కోలీవుడ్‌లో చక్కెర్లు కొడుతోంది. విశాల్, అనీశా మధ్య విభేదాలు తలెత్తాయని.. అందుకే పెళ్లి ఆగిపోయిందని టాక్. దీనికి బలమైన కారణం కూడా కనిపిస్తోంది. నిశ్చితార్థం తర్వాత అనీశా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తూ ఉండేవారు. కొద్ది రోజులుగా విశాల్ ఫొటోలను అనీశా షేర్ చేయడం లేదు. అంతేకాదు అంతకు ముందు తను షేర్ చేసిన ఫొటోలను కూడా డిలీట్ చేశారు. వీటిని ప్రధాన కారణంగా చూపుతూ.. విశాల్, అనీశా మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే నిశ్చితార్థం రద్దు చేసుకున్నారని అంటున్నారు. అయితే దీనిపై అటు విశాల్‌గానీ, అనీశాగానీ ఇప్పటి వరకు స్పందించలేదు. వాస్తవానికి విశాల్‌కు ఇది కొత్తేమీ కాదు. గతంలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, విశాల్ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు విపరీతంగా వినిపించాయి. కానీ, ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇద్దరూ పెళ్లి వార్తలను ఖండించారు. ఆ తర్వాత విశాల్‌కు అనీశాతో నిశ్చితార్థం అయ్యింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZbmvcD

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....