మహానేత వైఎస్ రాజశేఖర్ 70వ జయంతి (జూలై 08) సందర్భంగా నివాళులు అర్పించారు రీల్ చంద్రబాబు శ్రీతేజ్. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో అద్భుతమైన నటన ప్రదర్శించి చంద్రబాబు పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన .. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో కాకుండా అంతకు ముందు ‘వంగవీటి’, ‘యాత్ర’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాల్లో నటించి మెప్పించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో చంద్రబాబు పాత్రను, ‘ఎన్టీఆర్ బయోపిక్’లో వైఎస్ఆర్ పాత్రను పోషించిన శ్రీతేజ్.. వైస్సార్ జయంతి సందర్భంగా మారువలేని కొన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘ఒక్క సారి నేను ఆయన పాత్రలోకి ప్రవేశిస్తే నాకు వేరే ప్రపంచమే తెలియదు’.. అంటూ షూటింగ్ సమయంలో దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇక ప్రతి సినిమాకు తన పాత్రకు సంబంధించి వేలాదిగా ఫొటోలను కలెక్ట్ చేసి పాత్రలో పర్ఫెక్షన్ సాధించే శ్రీతేజ్.. ఎన్టీఆర్ బయోపిక్ కోసం వైఎస్సార్ పాత్రకు సంబంధించి మహానేతకు సంబంధించిన అనేక ఫోటోలను కలెక్ట్ చేసిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీతేజ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ..
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2S5tD3O
No comments:
Post a Comment