‘తెలుగు సినిమా పరిశ్రమకు కావాల్సింది ఇలాంటి నాన్ రొటీన్ చిత్రాలే.. థియేటర్స్‌కి వెళ్లి తప్పకుండా ఇలాంటి చిత్రాన్ని చూడమని మా అమ్మకి చెప్పా.. ‘ఓ బేబీ’ చిత్రం ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిది. నా రేటింగ్ 4/5’.. ఇదీ నటించిన ‘ఓ బేబీ’ చిత్రంపై వస్తున్న స్పందన. చేస్తే మంచి సినిమాలే చేస్తా.. లేదంటే ఇంట్లో కూర్చుంటా అని భీష్మించుకుని పక్కా బ్లాక్ బస్టర్ హిట్‌లు కొడుకున్న అక్కినేని కోడలు సమంత తాజాగా ‘ఓ బేబీ’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించేందుకు నేడు (జూలై 05)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ‘అలా మొదలైంది’ ఫేమ్ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. నాగ శౌర్య,లక్ష్మీ, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో సమంత 23 ఏళ్ల యువతిగా 70 ఏళ్ల బామ్మగా డిఫరెంట్ రోల్ ప్లే చేసి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై అంచనాలను పెంచేసిన సమంత.. ఈ మూవీ ప్రమోషన్స్ మొత్తాన్ని తన భుజాల వేసుకుని మునుపెన్నడూ లేనంతా విపరీతమైన ప్రచారాన్ని తీసుకువచ్చారు. ఈ చిత్రానికి విడుదలకు ముందే మంచి హైప్ రావడంతో సమంత సోలో మూవీని ప్రపంచ వ్యాప్తంగా నేడు భారీగా విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా యూఎస్, యూకేలలో ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో ట్విట్టర్ ద్వారా స్పందనలు తెలియజేస్తున్నారు నెటిజన్లు. సమంత కెరియర్‌లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని.. రాక్ స్టార్‌లా సమంత నటనతో మెరిసిందని.. క్లైమాక్స్ హార్ట్ టచ్చింగ్‌గా ఉందంటున్నారు. ఇంకొంత మందైతే తమ గ్రాండ్ మదర్స్‌తో చిత్రాన్ని వీక్షించి అద్భుతంగా ఉందంటున్నారు. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే అదే సందర్భంలో ఎమోషనల్ డ్రామాగా అందమైన చిత్రాన్ని మలిచారని.. ఈవారం బాక్సాఫీస్‌ని ‘ఓ బేబీ’ కుమ్మేయడం ఖాయమే అంటున్నారు. ఫస్టాఫ్ అదిరిపోయింది.. సమంత ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫామెన్స్ ఇచ్చింది. సీనియర్ నటి లక్ష్మీ మంచి నటనను ప్రదర్శించారు. కాన్సెప్ట్, స్టోరీ కొత్తగా ఉంది. సమంత పెర్ఫామెన్స్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్స్. ముఖ్యంగా కామెడీ ఇరగదీసింది సమంత అంటూ వరుస ట్వీట్లతో ‘ఓ బేబీ’ని వహ్ వా ‘బేబీ’ అనేస్తున్నారు నెటిజన్లు. మరికొంత మంది స్పందనలను ట్వీట్ల ద్వారా చూద్దాం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NwZuf1
No comments:
Post a Comment