Thursday, 4 July 2019

Saaho: ‘సైకో సయియా’ అస్సలు ఆగడట!

రెబల్ స్టార్ హీరోగా వస్తోన్న ‘సాహో’ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ‘బాహుబలి’ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు ‘సాహో’ సినిమాతో వారికి యాక్షన్ ఫీస్ట్‌ను అందించబోతున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో యాక్షన్ సీక్వెన్సులను తెరకెక్కించడంతో ‘సాహో’పై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు హీరో ప్రభాస్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా నిర్మాతలు ప్రచారం చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో విడుదలవుతోన్న ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ‘సాహో’లోని తొలి పాటను ప్రేక్షకుల ముందకు తీసుకురాబోతున్నారు. ఈ నెల 8న ఈ పాటను విడుదల చేస్తున్నారు. అయితే, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని క్రియేట్ చేసేందుకు ఈ పాట టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ‘సైకో సయియా’ అంటూ సాగే ఈ పాట యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. మంచి బీట్.. దానికి అనుగుణంగా పిక్చరైజేషన్.. ప్రభాస్, శ్రద్ధా కపూర్ ఎట్రాక్షన్ కలుపుకుని టీజర్ అదిరింది. బాలీవుడ్ కంపోజర్ తనిష్క్ బాగ్చి ఈ పాటను స్వరపరిచారు. ధన్వి భనుశాలి ఆలపించారు. తనిష్క్ బాగ్చి, శ్రీజో సంయుక్తంగా పాటను రచించారు. 28 సెకెన్లు ఉన్న ఈ సాంగ్ టీజర్ హై ఓల్టేజ్‌లో ఉంది. కాగా, ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అత్యధికంగా విదేశాల్లో చిత్రీకరించారు. హైదరాబాద్, ముంబైతో పాటు అబుదాబి, దుబాయ్, రొమానియా, ఆస్ట్రియాతో పాటు యూరప్‌లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. టి-సిరీస్ అధినేతలు గుల్షన్ కుమార్, భూషన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. సుధీర్ఘ కాలంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Nyyg7T

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....