Tuesday 16 July 2019

Nagarjuna Bigg Boss: బిగ్ బాస్‌ని ఇంప్రెస్ అంటే.. నాగార్జున అనేనా?: శ్వేతా రెడ్డి బిగ్ బాంబ్

ఇది హౌస్ కాదు.. బ్రోతల్ హౌస్ అంటూ సంచలన కామెంట్స్‌తో హాట్ టాపిక్‌గా మారింది యాంకర్ . మరో వారంలో బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కానుండగా.. బిగ్ బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ (ఆఫర్ల పేరుతో పడక సుఖం) ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఒక్కొక్కరుగా బిగ్ బాస్ షోపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలుచేస్తూ వెలుగులోకి వస్తున్నారు. తొలిత యాంకర్ శ్వేతా రెడ్డి.. బిగ్ బాస్‌లో ఆఫర్ కావాాలంటే బాస్‌ని ఆ రకంగా ఇంప్రెస్ చేయాలని షరతు పెట్టారని ఆరోపణలు చేయగా.. నటి గాయత్రి గుప్తా సైతం ఇదే రకమైన ఆరోపణలు చేసింది. తనను సెక్స్ లేకుండా 100 రోజులు ఉండగలవా? అని తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఇద్దరూ కావాలనే బిగ్ బాస్‌కి ప్రచారం కల్పించేందుకు పక్కా స్క్రిప్ట్ ప్రకారం ఇదంతా చేస్తున్నారని.. ఇదంతా ఒక వ్యూహంలో భాగమే అంటూ ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు శ్వేతా రెడ్డి. ‘మీరు అసలు బిగ్ బాస్‌కి సెలెక్ట్ అవ్వడం నిజమేనా? దాని ప్రూఫ్ ఏంటి అంటే తనదైన శైలిలో సమాధానం ఇస్తోంది శ్వేతా రెడ్డి. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘బిగ్ బాస్ అగ్రిమెంట్‌ అయ్యిందంటేనే నేను సెలెక్ట్ అయ్యానడానికి ప్రూఫ్. ఆ అగ్రిమెంట్ ప్రూఫ్ నాకు ఇవ్వలేదు. అప్పుడు రఘు అనే వ్యక్తిని అడిగా. మీరు ఫైనల్ అయ్యారు అని చెప్పారు. పేమెంట్ కూడా ఇస్తానన్నారు. అప్పుడు నాకు ఓ ఫిగర్ అప్పారు దానికి 2 పర్సెంట్ ఎక్స్ ట్రా అడిగా అంతే. అక్కడ ఒక్కొక్కరికీ ఒక్కో రేటు ఉంటుంది నాకు చెప్పిన ఫిగర్‌ కంటే.. ఆ ఫిగర్‌తో పోల్చుకుంటే నాకన్నా అంతా పాపులర్ కాని వారికి హై ఫిగర్ చెప్పారు. అయినప్పటికీ బిగ్ బాస్ అంటే దెయ్యాల కొంపలా చూస్తారు. దాని సంగతి చూద్దాం అనుకున్నా. అయితే 10 సిట్టింగ్‌ల తరువాత అగ్రిమెంట్ అయిన తరువాత బిగ్ బాస్ అసలు రంగు బయట పడింది. ఫైనల్ సిట్టింగ్‌లో శ్యామ్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అతను వచ్చి మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారు? ఎలా ఇంప్రెస్ చేస్తారు? అని చిరాకు రప్పించాడు. ఆ మహానుభావుడి బాధ అంతా ఎలా ఇంప్రెస్ చేయడంలోనే ఉంది. ఇంకేం ఇంప్రెస్ చేస్తాం. ఎలా ఇంప్రెస్ చేస్తాం. అతను బాస్‌ని ఇంప్రెస్ చేయాలి అనేవారు. ఇంతకీ బాస్ అంటే ఎవరో నాకు అర్ధం అయ్యేది కాదు. బిగ్ బాస్ అని ఒక సౌండ్ వస్తుంది కదా.. ఆ సౌండ్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలియదు. ఆయన్ని ఇంప్రెస్ చేయాలా? లేకపోతే ఆప్రోగ్రామ్ మానిటర్ చేస్తున్న వ్యక్తిని ఇంప్రెస్ చేయాలా? లేక ముంబై టీంలో హెడ్‌ని ఇంప్రెస్ చేయాలా? లేకపోతే హోస్ట్ చేస్తున్న నాగార్జున గారిని ఇంప్రెస్ చేయాలా? అన్నది తెలియలేదు. ఇంతకు నేను ఇంప్రెస్ చేయాల్సింది ఏ బాస్‌‌నో చెప్పలేదు. ఏ రకంగా ఇంప్రెస్ చేయాలో కూడా చెప్పలేదు. వాళ్లు ఇంప్రెస్ అంటే నేను ఒక్కటే అడిగా.. బాస్‌ని ఇంప్రెస్ చేస్తారు? అంటే మైండ్‌లో బొచ్చెడు మంది బాస్‌లు వస్తారు. ఆఫీస్‌లో బాస్ గుర్తుకువస్తాడు.. మంచి చెడ్డలు చెప్పే బాస్ గుర్తుకువస్తారు. లేదంటే నాగార్జున బాస్ సినిమా గుర్తుకు వస్తుంది. ఇంతకీ వాళ్లు చెప్పిన బాస్ ఎవరో తెలియలేదు. అయినా బాస్ ఎవరన్నది నేను అడగలేదు.. నేను ఇంప్రెస్ చేసే ఆలోచన ఉంటే బాస్ ఎవరో తెలుసుకునేదాన్ని.. అయినా ఇంప్రెస్ చేసి బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లాల్సినంత కర్మ నాకు పట్టలేదు. ఇంప్రెస్ అంటే టాస్క్‌లు అనే అనుకున్నా తప్ప.. ఆ థాట్ నాకు రాలేదు. టీవీ 5 మూర్తి డిస్కషన్‌కి వెళ్లాక ఇంప్రెస్ అంటే కమిట్ మెంట్ అని తెలుసుకున్నా’ అంటూ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు శ్వేతా రెడ్డి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JNtFJT

No comments:

Post a Comment

'Rakesh Jhunjhunwala Inspires Investors'

'More investors now view the stock market as a valuable opportunity, though many still seek quick gains, leading to a rise in futures an...