Saturday, 20 July 2019

Jagapati Babu కామెంట్స్‌పై మహేష్ స్పందన.. తప్పుకున్నారా? తప్పించారా?

‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ .. హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నారు. పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్, ఎఫ్ 2.. చేసిన నాలుగు చిత్రాలు బ్లాక్ బస్టర్‌లు కావడంతో మహేష్‌తో బిగ్ ప్రాజెక్ట్ చేసే గోల్డెన్ ఆఫర్ దక్కింది అనీల్ రావిపూడికి. ఇక మహేష్ బాబుకి సైతం హిట్ ఇచ్చే దర్శకుడితో పనిచేసే అలవాటు ఉండటంతో ‘సరిలేరు నీకెవ్వరు’ అనేశారు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు కీలకపాత్రలో నటించనుండగా.. సడెన్‌గా ఈ ప్రాజెక్ట్‌ నుండి ఆయన తప్పుకున్నారు. దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నుండి జగపతిబాబుని కావాలనే తప్పించారని రూమర్స్ నడుస్తుండగా.. మరోవైపు ముందు ఒక కథను నెరేట్ చేసి షూటింగ్‌కి వెళ్లిన తరువాత కథలో మార్పులు చేయడంతో ఈ ప్రాజెక్ట్ నుండి జగపతి బాబే తప్పుకున్నారంటూ భిన్న కథనాలు వినిపించాయి. అయితే ఈ ఇష్యూపై దుమారం రేగడంతో జగపతిబాబు ఎమోషనల్‌గా స్పందిస్తూ.. ట్విట్టర్‌లో వీడియో విడుదల చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నుండి తాను తప్పుకున్నట్టుగా పుకార్లు వస్తున్నాయని.. సినిమా అనేది నా ఫ్యామిలీ లాంటిది.. నా ఫ్యామిలీ కోసం మాట్లాడటం ఇష్టం లేదు. అయితే ఒక క్లారిఫికేషన్ అయితే తప్పలేదు. గత 33 ఏళ్లుగా నేను ఇలా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఈ రూమర్స్‌లో నిజం లేదన్నారు . ఇప్పటికీ మహేష్ చిత్రంలో నటించడానికి సిద్ధంగానే ఉన్నానని.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలో నేను లేను. అంతే తప్పితే ఇందులో పెద్ద వివాదం లేదంటూ చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు జగపతి బాబు. అయితే జగపతిబాబు ఎమోషనల్ ట్వీట్‌పై స్పందించారు మహేష్ బాబు. ‘థాంక్యూ సార్.. మీరంటే మాకు ఎప్పటికీ ప్రేమ గౌరవం’ అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు. దర్శకుడు అనీల్ రావిపూడి సైతం స్పందిస్తూ.. ‘అర్ధం చేసుకున్నందుకు థాంక్స్ సార్.. ఎప్పటికీ మీరంటే గౌరవం’ అని ట్వీట్ చేశారు. అనీల్ ట్వీట్‌పై స్పందించిన జగపతి బాబు.. ‘థాంక్స్ యు ఫర్ ది క్లారిఫికేషన్’ అంటూ హుందా స్పందించారు. మొత్తానికి జగపతిబాబు, మహేష్ బాబు, అనీల్ రావిపూడి ట్వీట్లు చూస్తుంటే.. ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం నుండి జగపతి బాబు కావాలని తప్పుకోలేదని.. తప్పించిన మాట వాస్తవమే అని తెలుస్తోంది. ఈ వివాదంపై జగపతిబాబుకి మద్దతుగా నిలుస్తున్నారు నెటిజన్లు.. అన్ని ఇండస్ట్రీ వాళ్లు మీ లాంటి నటుడ్ని కావాలని కోరుకుంటుంటే మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు వాళ్లు ఫీల్ కావాలి. మీలా నటించే నటుడు ఎవరు సార్.. మహేష్‌తో మీ కాంబినేషన్ ఎలా ఉంటుందో శ్రీమంతుడులో చూశాం. ‘సరిలేరు నీకెవ్వరు’లో మిస్ అవుతున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JFtCAW

No comments:

Post a Comment

'After Aradhana, People Took Me Seriously'

'Everybody was scared, especially with Rajesh Khanna playing a double role and playing my lover and my son.' from rediff Top Inter...