
జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్‌తో పాపులర్ అయిన కమెడియన్ వినోద్ (వినోదిని)పై హత్యాయత్నం జరిగింది. హైదరాబాద్‌లోని కుత్బిగూడలో అద్దె ఇంటిలో నివాసిస్తున్న వినోద్‌పై ఇంటి ఓనర్ దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వినోద్ ప్రస్తుతం ఆసుపత్రితో చికిత్స పొందుతున్నారు. తన ఇంటి ఓనర్ తనపై హత్యాయత్నం చేసినట్టు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసారు వినోద్. కాగా.. నాలుగు నెలల క్రితం వినోద్ తాను ఉంటున్న 70 గజాల ఇంటిని కొనుగోలు చేసేందుకు యజమానికి రూ.10లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. అయితే అడ్వాన్స్ తీసుకున్న తరువాత ఆ ఇంటిని అమ్మనని.. అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం రేగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం వినోద్ ఇంటి యజమానిని నిలదీయగా ఇంటి యజమానితో పాటు అతని భార్య కొడుకులు వినోద్‌పై దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో వినోద్ తలకు తీవ్రగాయాలు అయ్యాయి.. దాడికి దిగిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసేందుకు పోలీసులు సన్నద్దం మయ్యారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Stn9Ma
No comments:
Post a Comment