Sunday 14 July 2019

అన్న కథతో తమ్ముడు ఆనంద్ దేవరకొండ!

‘దొరసాని’ చిత్రంతో అరంగేట్రంలోనే తొలి హిట్ అందుకున్నారు విజయ్ దేవరకొండ తమ్ముడు . కొత్త దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన తెలంగాణ నేపథ్యంలోని అందమైన ప్రేమ కథకు ప్రేక్షకుల నుండి మంచి స్పందనలే వస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ‘దొరసాని’.. శివాత్మిక రాజశేఖర్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. తల్లి జీవిత నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆమెలాగే హావభావాలను పలికిస్తూ తొలి చిత్రంలోనే విమర్శకులు ప్రశంసల్ని అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని కొంతమంది విమర్శకులు ఈ చిత్రాన్ని పాత చింకకాయ పచ్చడి ప్రేమకథ అని తీసిపారేస్తున్నా.. ప్రేమ కథలకు కొత్త పాత ఏముందీ.. అదెప్పటికీ నిత్య నూతనమే. పాత కథను నిత్య నూతనంగా తెలంగాణ మట్టి వాసనలతో అద్భుతంగా రూపొందించారు. కలెక్షన్లు, రివ్యూల సంగతి పక్కనపెడితే.. మొత్తానికి ఎవరు అవునన్నా.. కాదన్నా... తొలి చిత్రంతో ఆనంద్ దేవరకొండ, శివాత్మికలు ఆకట్టుకున్నారు. దర్శకుడిగా కేవీఆర్ మహేంద్ర ప్రతిభ చూపారు. ఇక పోతే.. నాకు విజయ్ దేవరకొండ తమ్ముడు అనే కార్డ్ వద్దురా బాబూ.. నన్ను నన్నుగా గుర్తించండి.. ఆనంద్‌లో ఉన్న నటుడ్ని చూడండి. మా అన్నతో పోలిక వద్దు అంటూ నటనలో తాత, నాన్న, అన్నల భజనలకు దూరంగా ఇండస్ట్రీలో కొత్త సాంప్రదాయానికి తెరతీశాడు ఆనంద్ దేవరకొండ. వాస్తవానికి అతని అన్న విజయ్ దేవరకొండ కూడా కోరుకునేది ఇదే అనే కుండబద్దలు కొట్టేశాడు. ఇక విజయ్ దేవరకొండ అయితే ఒక అడుగు ముందుకు వేసి.. నీ సినిమా నువ్ తీసుకో.. నా దగ్గరకు రా మాకు. వచ్చినా నేను హెల్ప్ చేయను అను మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తప్పదు కాబట్టి వచ్చి ‘దొరసాని’ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్నాడు విజయ్ దేవరకొండ. తొలి చిత్రంతో నటుడిగా నిలదొక్కుకునేందుకు ‘దొరసాని’తో మంచి బేస్ వేసుకున్న ఆనంద్ దేవరకొండ.. తన రెండో చిత్రంపై ఫోకస్ పెట్టాడు. భవ్య క్రియేషన్స్‌లో మరో వెరైటీ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట ఆనంద్ దేవరకొండ. భవ్య క్రియేషన్స్‌లో ఓ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ కొత్త దర్శకుడు విజయ్ దేవరకొండ కోసం కథను రెడీ చేయగా.. ఆ కథను ఆనంద్ దేవరకొండ తీసుకున్నట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ తమ్ముడు అనే కార్డ్ వద్దనుకుంటున్న ఆనంద్ దేవరకొండ అన్న కథతో రెండో చిత్రానికి త్వరలో కొబ్బరికాయ కొట్టబోతున్నట్టు సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LlsUuJ

No comments:

Post a Comment

'Nifty Pullback Needs To Be Taken In Stride'

'The biggest near-term risk to Indian equities is the outflow of investments to China as tactical trades by foreign investors.' fr...