ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఆగస్ట్ 15, 16 తేదీల్లో ఖతార్‌లో జరగనుంది. ఈ వేడుకకు సంబంధించిన వివరాలను శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, శ్రియా శరన్, విబ్రి మీడియా ఎండీ విష్ణు ఇందూరి, పాంటలూన్స్ మార్కెటింగ్, ఈకామర్స్ హెడ్ ర్యాన్ ఫెర్నాండెజ్, శాన్వి శ్రీవాస్తవ, అస్మిత నర్వాల్, నిధి అగర్వాల్, మాన్వితా కామత్, రుహాని శర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల సినిమాలకు వచ్చిన నామినేషన్ల గురించి వెల్లడించారు. 2018లో ఈ నాలుగు భాషల్లో విడుదలైన అత్యుత్తమ చిత్రాలతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ విలన్, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ పాటల రచయిత, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ హాస్యనటుడు తదితర విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. తెలుగులో ‘రంగస్థలం’ సినిమా అత్యధికంగా 12 విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఆ తరవాత ‘మహానటి’ 9 విభాగాల్లో నామినేట్ అయ్యింది. ‘గీత గోవిందం’ 8, ‘అరవింద సమేత’ 6 విభాగాల్లో నామినేట్ అయ్యాయి. వీటిలో ఏ చిత్రానికి ఎక్కవ అవార్డులు దక్కుతాయో చూడాలి. భాషల వారీగా అత్యధిక విభాగాల్లో నామినేషన్లు పొందిన చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి.. తెలుగు 1. రంగస్థలం - 12 నామినేషన్లు 2. మహానటి - 9 నామినేషన్లు 3. గీత గోవిందం - 8 నామినేషన్లు 4. అరవింద సమేత - 6 నామినేషన్లు తమిళం 1. 96 - 10 నామినేషన్లు 2. కోలమావు కోకిల - 7 నామినేషన్లు 3. వడ చెన్నై - 6 నామినేషన్లు మలయాళం 1. సుదాని ఫ్రం నైజీరియా - 9 నామినేషన్లు 2. వరదన్ - 6 నామినేషన్లు 3. అరవిందంటె అదితికల్ - 5 నామినేషన్లు 4. పూమరం - 5 నామినేషన్లు కన్నడ 1. కేజీఎఫ్ చాప్టర్ 1 - 12 నామినేషన్లు 2. తగరు - 11 నామినేషన్లు 3. సర్కారి హి. ప్ర. షాలే, కాసరగోడు, కొడుగె: రామన్న రాయి - 10 నామినేషన్లు
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SsIbKM
No comments:
Post a Comment