Sunday 7 July 2019

సమంతది రెండు నాల్కల ధోరణా.. ‘అర్జున్ రెడ్డి’పై ఆమె ఏమన్నారు?

‘అర్జున్ రెడ్డి’ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. తెలుగు సినీ చరిత్రలోనే కాదు.. యావత్తు భారతదేశ సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా రాలేదంటూ చాలా మంది కొనియాడారు. అందుకే, తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాను హిందీలోనూ రీమేక్ చేశారు. తెలుగులో తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డినే షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో చేశారు. అయితే, ఈ సినిమాలోని ముద్దులు, చెంప దెబ్బల సన్నివేశాలపై విమర్శలొచ్చాయి. వీటిపై సందీప్ రెడ్డి స్పందిస్తూ.. ‘ఒకరిని ఒకరు చెంపపై కొట్టుకునే స్వేచ్ఛ లేకపోతే వారి మధ్య ప్రేమ ఉంటుందని నేను అనుకోను’ అని సందీప్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా, సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఫీలయ్యే ఆడవాళ్లు ఇప్పటి వరకు నిజమైన ప్రేమను చూసుండరు అని ఘాటుగానే స్పందించారు. సందీప్ రెడ్డి చేసిన కామెంట్లు అక్కినేనిని బాధించాయి. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డీప్లీ డిస్టర్బింగ్’ అంటూ సందీప్ రెడ్డి కామెంట్లపై స్పందించారు. సమంత చేసిన ఈ కామెంట్‌ను పట్టుకుని ఓ తెలుగు న్యూస్ వెబ్‌సైట్ సమంతది రెండు నాల్కల ధోరణి అంటూ ట్వీట్ చేసింది. అప్పుడెప్పుడో ‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చినప్పుడు సమంత చేసిన ట్వీట్‌ను పట్టుకుని ఆమెపై బురదజల్లే ప్రయత్నం చేసింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చినప్పుడు సమంత చేసిన ట్వీట్‌ స్క్రీన్ షాట్‌ను, ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇమేజ్‌ను కలిపి ట్వీట్ చేసింది. అయితే, ఈ ట్వీట్‌పై సమంత కాస్త ఘాగానే స్పందించారు. ‘ఆ సినిమా అంటే ఇష్టమే. కానీ, నా కామెంట్స్‌ను రెండు వేర్వేరు అంశాలుగా చెప్పడాన్ని నేను అంగీకరించను. ‘అర్జున్ రెడ్డి’ కథ నాకు నచ్చింది. ప్రేమ అంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ల చెంపలు పగలగొట్టే స్వేచ్ఛ అని చెప్పడం నాకు నచ్చలేదు’ అని సమంత చెంప చెళ్లుమనేలా ట్వీట్ చేశారు. మొత్తం మీద ఎప్పుడో అయిపోయిన కథను ఈ న్యూస్ వెబ్‌సైట్ మళ్లీ తెరపైకి తెచ్చి వైరల్ చేసే ప్రయత్నం చేసింది. కానీ, సమంత దానికి అడ్డుకట్ట వేసేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2xwLIOr

No comments:

Post a Comment

The Spy Who Became A Farmer

'Everything about farming is enjoyable and relaxing.' from rediff Top Interviews https://ift.tt/xBDjVyT