ఆయా సంస్థలకు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న సెలబ్రెటీలే వాటి సేవాలోపంతో చిక్కుల్లో పడుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్న తారలు ఆయా సంస్థలపై ప్రశంసలు గుప్పిస్తూ ప్రకటనలు చేస్తుంటారు. వాటిని చూసి వారి అభిమానులు, ప్రజలు ఆ సంస్థల సేవలను పొందేందుకు క్యూ కడుతున్నారు. అయితే కొన్నిసార్లు ఆయా సంస్థలు సేవాలోపంతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాగే ఓ ఫిట్‌నెస్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైదరాబాద్‌లో కేసు నమోదుకావడం చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కల్ట్ ఫిట్‌నెస్ సంస్థ హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్-3లో ఓ జిమ్ నిర్వహిస్తోంది. హృతిక్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ బ్రాంచ్‌కు ముకేష్ బాంచల్ డైరెక్టర్‌గా, సీఈవోగా అంకిత్, మేనేజర్‌గా సుబ్రమణ్యం వ్యవహరిస్తున్నారు. అధిక బరువు తగ్గించేందుకు సంవత్సరానికి రూ.17,490-36,400 ఫీజుతో ఆ సంస్థ ఇటీవల ప్యాకేజీలను ప్రకటించింది. దీంతో చాలామంది మెంబర్‌షిప్ తీసుకున్నారు. ఈ ప్యాకేజీల్లో పరిమితికి మించి సభ్యులు చేరడంతో చాలామందికి స్లాట్ కేటాయించడం కష్టంగా మారింది. దీనిపై చాలామంది సభ్యులు నిర్వాహకులను నిలదీస్తున్నా వారి నుంచి సరైన సమాధానం రావడం లేదు. దీంతో శశికాంత్ అనే బాధితుడు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ వద్ద వేలకు వేలు ఫీజులు కట్టించుకుని ఎక్సర్‌సైజ్ చేసుకునేందుకు స్లాట్స్ కల్పించడం లేదని, గట్టిగా నిలదీస్తే తమను జిమ్‌కు రానివ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిర్వాహకులతో పాటు అంబాసిడర్‌గా ఉన్న హృతిక్‌పైనా చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో పోలీసులు డైరెక్టర్ ముకేష్ బాంచల్ , సీఈవోగా అంకిత్, మేనేజర్‌గా సుబ్రమణ్యంతో పాటు హృతిక్ రోషన్‌పైనా ఐపీసీ 420, 406 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NzwyTu
No comments:
Post a Comment