Sunday 14 July 2019

‘బిగ్ బాస్’కి సెక్సువల్ ఫేవర్.. నిర్వాహకులపై కేసు నమోదు

ప్రముఖ టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మూడో సీజన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జులై 21 నుంచి స్టార్ మాలో ఈ షో ప్రసారంకానుందని అంటున్నారు. అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో ఆయన అభిమానులతో పాటు బిగ్ బాస్ ఫ్యాన్స్ షో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆత్రుతగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ షో వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పటి వరకు సినీ పరిశ్రమకే పరిమితమైన లైంగిక వేధింపులు ఇప్పుడు ‘బిగ్ బాస్’లోకి కూడా వచ్చాయని హైదరాబాద్‌కు చెందిన మహిళా జర్నలిస్టు ఒకరు ఆరోపించారు. తాను బిగ్ బాస్ హౌజ్‌లోని అడుపెట్టాలంటే బాస్‌ను ఇంప్రస్ చేయాలని అడిగారని ఆరోపిస్తూ ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లైంగిక వేధింపుల కింద ‘బిగ్ బాస్’ నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read: తనకు మార్చిలో బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చిందని, తనను షోకు ఎంపిక చేసినట్టు చెప్పారని ఆ మహిళా జర్నలిస్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అగ్రిమెంట్ అంతా పూర్తయిన తరవాత బాస్‌కు సెక్సువల్ ఫేవర్ చేయాలని వేధించారని ఆరోపించారు. ఈ మేరకు నిర్వాహకులు అభిషేక్, రవికాంత్, రఘు, శ్యామ్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఫిర్యాదుపై బంజారాహిల్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘రియాలిటీ షో ఆఫర్‌ను అంగీకరించిన ఆమె.. దానికి సంబంధించిన నలుగురు వ్యక్తులను కలిశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఈ మీటింగ్‌లలో ఆ నలుగురు వ్యక్తులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. షో ఫైనల్ సెలక్షన్ సమయంలో తమ బాస్‌ను సంతృప్తిపరచాలని ఆమెను అడిగారు’ అని వెల్లడించారు. ఈ నలుగురిపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదుచేశామని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2G9FyIU

No comments:

Post a Comment

'Nifty Pullback Needs To Be Taken In Stride'

'The biggest near-term risk to Indian equities is the outflow of investments to China as tactical trades by foreign investors.' fr...