
విడుదలైన త్రీడీ యానిమేషన్ చిత్రం ‘ద లయన్ కింగ్’ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే, ఈ సినిమా చూసిన తర్వాత అంతా ‘బాహుబలి’ గురించే మాట్లాడుకుంటున్నారు. కారణం.. ఈ సినిమా కథ, అందులోని పాత్రలు ప్రతి ఒక్కటీ ‘బాహుబలి’ సినిమానే తలపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా బాహుబలికి ‘యానిమల్’ వెర్షన్ అని చెప్పవచ్చు. అయితే, ‘ద లయన్ కింగ్’ సినిమాను ‘బాహుబలి’ స్ఫూర్తిగా తీశారనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ‘ద లయన్ కింగ్’ సినిమా 1994లోనే కార్టూన్ చిత్రంగా విడుదలైంది. అప్పట్లో కూడా ఈ సినిమాకు మంచి ఆధరణ లభించింది. దీంతో 2019లో మరిన్ని హంగులతో సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి ‘ద లయన్ కింగ్’ త్రీడీ చిత్రాన్ని రూపొందించి విడుదల చేశారు. ఇండియాలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలైంది. అయితే, ఈ సినిమా చూస్తున్నంత సేపు ‘బాహుబలి’ సినిమా అనే భావం మనసులో కలగకుండా విజువల్ వండర్‌తో సాగుతుందని ప్రేక్షకులు చెప్పడం విశేషం. ‘ద లయన్ కింగ్’ సినిమా జక్కన్న కాపీ కొట్టారనడం కంటే స్ఫూర్తిగా తీసుకున్నారని చెప్పడమే ఉత్తమం. ఎందుకంటే.. ఇదే స్టోరీ లైన్‌తో హాలీవుడ్‌లో ‘బ్లాక్ పాంథర్’, ‘హమ్లెట్’, ‘థోర్’, హిందీలో ‘హైదర్’ సినిమాలు తెరకెక్కాయి. కథాంశం ఒకేలా ఉన్నా.. వాటిని సరికొత్తగా చూపించడంలో దర్శకులు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. లేకుంటే, ఆయా సినిమాలకు అంత ప్రజాధారణ లభించేదా చెప్పండి? ‘ద లయన్ కింగ్’పై ట్విట్టర్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. కొందరు ‘ద లయన్ కింగ్’ ట్రైలర్‌ను ‘బాహుబలి’ ట్రైలర్‌తో కలిపి ఆ రెండు చిత్రాల మధ్య ఉన్న సారూప్యత చూపిస్తున్నారు. 1994లో విడుదలైన సినిమానే ‘బాహుబలి’గా తీశారని చెబుతున్నారు. ఎవరెవరు ఏమంటున్నారనేది ఈ ట్వీట్లలో చూడండి. 1994లో విడుదలైన ‘ద లయన్ కింగ్’ సినిమాలో ఓ సీన్.. ‘బాహుబలి’ మాటలతో..: ‘ద లయన్ కింగ్’ ట్రైలర్‌తో ‘బాహుబలి’ ట్రైలర్‌ను లింక్ పెట్టి..
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SvM1mn
No comments:
Post a Comment