Monday 15 July 2019

‘ఇస్మార్ట్ శంకర్’.. ‘ఎ’ సర్టిఫికెట్ సినిమా!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తొలిసారి ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో కలిసి పనిచేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా వస్తోంది. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లు. ఈనెల 18న విడుదలవుతోన్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ను చూసిన సెన్సార్ సభ్యులు ఆ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారు. అంటే పెద్దలు మాత్రమే చూడదగిన సినిమా ఇది. ‘దేశముదురు’, ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’ తరవాత పూరీ మరో ‘ఎ’ సర్టిఫికెట్ సినిమా తీయడం ఇదే. కాగా, ఈ సినిమాపై ఇప్పటికే బజ్ క్రియేట్ అయ్యింది. సినిమాకు విపరీతంగా ప్రచారం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు, ప్రోమోలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. రామ్ తొలిసారి పూర్తిస్థాయి తెలంగాణ కుర్రాడి పాత్రలో నటించడంతో సినిమాపై ఆసక్తి మరింత ఎక్కువైంది. రామ్ హైపర్ పెర్ఫార్మెన్స్, పూరీ మార్క్ డైలాగులు, హీరోయిన్ల అందచందాలు వెండితెరపై ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు. వీటికి తోడు సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ మాస్ ఆడియన్స్‌ను మెప్పించే మంచి పాటలు అందించారు. ఇక ఆయన ఇచ్చే నేపథ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ‘ఇస్మార్ట్ శంకర్’కు సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడంపై హీరో రామ్ కూడా స్పందించారు. శంకర్ ‘ఎ’ ఫిక్షనల్ క్యారెక్టర్‌గా మాత్రమే ప్రేక్షకులు చూడాలని ట్విట్టర్ ద్వారా సూచించారు. ‘ఇస్మార్ట్ శంకర్’లో చూపించిన మద్యపానం, ధూమపానం నిజజీవితంలో ఆరోగ్యానికి ఎంతో హానికరమని దాని జోలికి వెళ్లకండి అంటూ సలహా ఇచ్చారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేశ్, పునీత్ ఇస్సార్, సత్యదేవ్, జయలలిత, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుదాన్షు పాండే, మధు సింగంపల్లి, కుల్దీప్ సింగ్, దీపక్ శెట్టి ప్రధాన తారాగణం. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్, జునైద్ సిద్ధిఖీ ఎడిటర్. కాసర్ల శ్యామ్, భాస్కరభట్ల పాటలకు సాహిత్యం అందించారు. రియల్ సతీష్ ఫైట్లు కంపోజ్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30BmCKV

No comments:

Post a Comment

'They Can Easily Arrest You'

'The work of a film-maker is going out and making films.' from rediff Top Interviews https://ift.tt/TdM2ew6