Friday 12 July 2019

కమెడియన్ పృథ్వీకి కీలక పదవి.. ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం

పాలనలో తన మార్క్ చూపిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్‌విబిసి) చైర్మన్‌గా సినిమా ఇండస్ట్రీకి చెందిన కమెడియన్ పృథ్వీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్‌సీపీ స్టేట్ సెక్రటరీగా పార్టీకి సేవలు అందించిన పృథ్వీకి ఈ పదవి వరించింది. జగన్‌తో పాటు పాద యాత్రలో పాల్గొనటమే కాకుండా పార్టీ తరుపున వివిధ చర్చా వేదికల్లో, బహిరంగ సభల్లో, సోషల్ మీడియాలో టీడీపీకి గట్టి కౌంటర్లు ఇచ్చేశారు పృథ్వీ. కాగా ఈ పదవికి ఇండస్ట్రీ నుండి జీవిత, రాజశేఖర్, మోహన్ బాబు పేర్లు వినిపించగా.. చివరికి పృథ్వీకే ఎస్‌విబిసి చైర్మన్‌ పదవి దక్కింది. కాగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. ఎస్‌విబిసి చైర్మన్‌‌గా ఉన్న కె. రాఘవేంద్రరావు ఆ పదవికి రాజీనామా చేసి పక్కకి తప్పుకున్న విషయం తెలిసిందే. వయోభారం వల్ల ఈ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు రాఘవేంద్రరావు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2l8d0YD

No comments:

Post a Comment

'AI Doesn't Care Where It Goes To School'

'No one manufactures intelligence at the moment.' from rediff Top Interviews https://ift.tt/FtDHBiR