Friday, 18 August 2023

Arjun Rampal - ‘భగవంత్ కేసరి’ నాకొక సవాల్.. తెలుగు చాలా కష్టం: అర్జున్ రాంపాల్

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘భగవంత్ కేసరి’ సినిమాలో ప్రతినాయకుడిగా అర్జున్ రాంపాల్ నటించారు. ఇటీవలే ఆయన పోర్షన్‌కు సంబంధించిన చిత్రీకరణను పూర్తిచేశారు. ఇక ఈ ఏడాది జులైలో ఆయన నాలుగోసారి తండ్రయ్యారు. గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియల్లా డెమిట్రియేడ్స్ ద్వారా 50 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రయ్యారు అర్జున్ రాంపాల్. కాగా, తొలిసారి తెలుగులో నటించిన అర్జున్ రాంపాల్.. ఇక్కడ ఆయన ఎదుర్కొన్న సవాళ్ల గురించి హైదరాబాద్ టైమ్స్‌తో మాట్లాడారు. అలాగే, తను నాలుగోసారి తండ్రవ్వడం గురించి, తన కూతురు మైరా సొంతంగా ఎదగడం గురించి కూడా చెప్పుకొచ్చారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/WAGDFmw

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....