Saturday, 5 June 2021

పెళ్లి విషయమై అంజలి ఓపెన్ కామెంట్స్.. మరోసారి అలా చర్చల్లో నిలిచిన రాజోలు బ్యూటీ

లాక్ డౌన్ వేళ సినీ సెలెబ్రిటీలంతా ఒక్కొక్కరుగా మూడు ముళ్ల బంధంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ లిస్టులో చాలామంది యంగ్ హీరో హీరోయిన్లు చేరిపోయారు. దీంతో ప్రతి ఒకరి చూపు ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌పై పడింది. ఇక ఇప్పటికే ప్రేమలో ఉన్న సెలబ్రిటీ జోడీలపై మరింత ఫోకస్ పెట్టేశారు ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియన్ గ్లామర్ బ్యూటీ గురించిన టాపిక్ తెరపైకి రావడంతో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజోలుకి చెందిన అచ్చతెలుగు అమ్మాయి అంజలి. సినిమాల మీద ఆసక్తితో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనుకున్నంత సక్సెస్ అందుకోకపోయినా జనాల్లో పాపులారిటీ మాత్రం సంపాదించింది. తెలుగు, తమిళ భాషల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫోటో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ప్రేమలేఖ రాశా అనే సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత కాస్త ఇబ్బందులు పడినా మళ్లీ తెలుగులో మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో సీత పాత్రలో నటించి ఫేమ్ కొట్టేసింది. అయితే ఒకానొక సమయంలో తెలుగు తెరపై అవకాశాలు సన్నగిల్లడంతో తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలలో ఆమె తన లక్ పరీక్షించుకుంది. తమిళంలో దాదాపు 10 సినిమాలు చేసి అక్కడ కూడా ఫేమస్ అయింది ఈ బ్యూటీ. తమిళ్లోకి వెళ్లిన తర్వాత అక్కడ హీరో జై తో ప్రేమాయణం సాగించి చర్చల్లో నిలిచింది. ఆ మధ్య వీరి లవ్ మ్యాటర్స్ నిత్యం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే తిరిగి తెలుగు తెరపై 'వకీల్ సాబ్' రూపంలో హిట్ కొట్టేసిన అంజలి.. తన పెళ్లి విషయమై రియాక్ట్ అయింది. లాక్ డౌన్ సమయంలో చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితం మొదలు పెడుతున్న నేపథ్యంలో కూడా పెళ్లి చేసుకుంటుందా అని అంతా అనుకుంటున్న వేళ.. ఇప్పట్లో అలాంటి ఆలోచనే లేదని అంజలి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం కెరీర్ పైనే ఫోకస్ పెట్టానని చెప్పుకొచ్చింది. దీంతో పెళ్లి గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34TGc9j

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....