Saturday, 5 June 2021

సినిమా రౌండప్: చిరంజీవితో నాగబాబు తనయుడు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మెగాస్టార్ ఫోన్

మెగాస్టార్ సినిమాలో వరుణ్ తేజ్ చిరంజీవి హీరోగా రూపొందనున్న 'లూసీఫర్' తెలుగు రీమేక్‌లో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కీలక పాత్రలో నటించబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్‌, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్. బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. అతి త్వరలో పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. బాలయ్య కోసం కథ రెడీ.. వరుస సినిమాలతో సూపర్ ఫామ్‌లో ఉన్నారు బాలకృష్ణ. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ మూవీ చేస్తున్న ఆయన.. ఆ వెంటనే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. దీంతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉండబోతోందని సమాచారం. అంతేకాదు ఇప్పటికే బాలయ్య కోసం కథ సిద్ధం చేసి ఉంచారట అనిల్ రావిపూడి. ఎమ్మెల్యేకు మెగాస్టార్ ఫోన్ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి ఆయన యోగ క్షేమాలు అడిగారు. మీ మాట కోసం మీ జిల్లాకు ఆక్సిజన్ బ్యాంకును ఇచ్చానని తనతో చిరంజీవి అన్నట్లు ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీడియాకు చెప్పారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరపున తమ జిల్లాకు ఆక్సిజన్ బ్యాంకును కేటాయించడం పట్ల చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు శంకర్ నాయక్. 'గని' కొత్త షెడ్యూల్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'గని'. బాక్సింగ్‌ క్రీడా నేపథ్యంలో వరుణ్ తేజ్ 10వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్‌లో అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూలై నుంచి కొత్త షెడ్యూల్ షురూ కానుందని తాజా సమాచారం. అక్కినేని హీరోతో ఉపేంద్ర 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ కంప్లీట్ చేసిన అక్కినేని అఖిల్ తన తదుపరి సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నారు. కరోనా ప్రభావం తగ్గగానే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రను సీనియర్ స్టార్ హీరోలతో చేయిస్తే బాగుంటుందని భావించిన సురేందర్ రెడ్డి.. ఆ రోల్ కోసం కన్నడ సీనియర్ స్టార్ హీరో ఉపేంద్రను సెలక్ట్ చేశారని సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3poQg3H

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....