Saturday, 21 March 2020

Janta Curfew: రజినీకాంత్ వీడియోను తొలగించిన ట్విట్టర్.. కారణం ఇదే

కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ఆ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘జనతా కర్ఫ్యూ’కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపు మేరకు దేశ ప్రజలు ‘జనతా కర్ఫ్యూ’ని పాటిస్తున్నారు. ఎవ్వరూ ఇళ్లలో నుంచి బయటికి రాకుండా జనతా కర్ఫ్యూకి పూర్తి మద్దతును తెలియజేస్తున్నారు. అయితే, ప్రధాని మోదీ శుక్రవారం జనతా కర్ఫ్యూని ప్రకటించగానే ఆయనకు మద్దతుగా సినిమా స్టార్లు అంతా ప్రజలకు దీనిపై పలు సూచనలు చేశారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా ప్రతి సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు వీడియోలు విడుదల చేశారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జనతా కర్ఫ్యూకు సంబంధించి శనివారం ఓ వీడియోను విడుదల చేశారు. అయితే, ఈ వీడియోను ట్విట్టర్ తొలగించింది. ట్విట్టర్ నియమ నిబంధనలను ఈ వీడియో అతిక్రమించిన కారణంగా దాన్ని తొలగించినట్టు పేర్కొంది. ఇంతకీ రజినీకాంత్ వీడియోలో తప్పేముంది.. ఎందుకు ట్విట్టర్ తొలగించింది? దీనికి కారణం ఉంది. కరోనా వైరస్ (కోవిడ్ 19) లైఫ్‌టైమ్‌ను రజినీకాంత్ తప్పుగా చెప్పారు. ఈ వైరస్ లైఫ్‌టైమ్ 12 గంటలు కాగా.. రజినీకాంత్ 14 గంటలు అని చెప్పారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించినట్టుగా భావించి ట్విట్టర్ రజినీ వీడియోను తొలగించింది. కరోనా వైరస్ లైఫ్‌టైమ్ మినహా రజినీకాంత్ వీడియోలో తప్పేమీ లేదు. ఆయన చాలా మంచి సూచనలు చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ భారత్‌లో రెండో స్టేజ్‌లో ఉందని.. దాన్ని మూడో స్టేజ్‌కు వెళ్లకుండా ఆపాలని రజినీ అన్నారు. అలా వెళ్లకుండా అడ్డుకోవడానికే ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారని చెప్పారు. ఇటలీలో కూడా కరోనా రెండో స్టేజీలో ఉన్నప్పుడు ఆ దేశ ప్రభుత్వం కర్ఫ్యూ ఉత్తర్వులు జారీ చేసిందని.. కానీ, అక్కడి ప్రజలు సీరియస్‌గా తీసుకోలేదని వెల్లడించారు. అందుకే వేలాది మంది చనిపోయారని, వారిలా మనం అజాగ్రత్తగా ఉండకూడదని హెచ్చరించారు. ఇటలీ పరిస్థితి భారత్‌లో రాకూడదన్నారు. Also Read: దేశంలోని యువకులు, పెద్దలు అందరూ కర్ఫ్యూకు సహకరించాలని రజినీకాంత్ కోరారు. కరోనా నియంత్రణ కోసం తమ ప్రాణాలను లెక్క చేయకుండా వైద్య సేవలు చేస్తున్న అధికారులు, డాక్టర్లు, నర్సులను అభినందిస్తూ ప్రధాని మోదీ చెప్పినట్లు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి తులపులు, కిటికీల వద్దకు వచ్చి చప్పట్లు, గంటలు కొడుతూ మనసారా అభినందిద్దామని పిలుపునిచ్చారు. అయితే, ఈ వీడియోను ట్విట్టర్ తొలగించడంపై రజినీకాంత్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Wuyr6W

No comments:

Post a Comment

How RSS Plans To Win Vidarbha For BJP

'BJP and RSS may have differences over minor issues but their hearts long for one common aim -- that of A Hindu Rashtra.' from red...