ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. చైనా నుంచి ఇతర దేశాలకు పాకిన ఈ మహమ్మారి వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. లక్షలాంది మందికి సోకుతోంది. మన దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. చాలా రాష్ట్రాలు మార్చి 31 వరకు లాక్ డౌన్‌ను ప్రకటించాయి. వీటిలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మార్చి 31 వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రభుత్వాలు సూచించాయి. అయితే, ప్రధాని ప్రకటించిన జనతా కర్ఫ్యూలో పాల్గొన్నందుకే రోజువారీ కూలీలు తమ ఉపాధిని కోల్పోయారు. మరి, మరో వారం రోజులపాటు ఇంటికే పరిమితమైతే వారికి పూట గడిచేది ఎలా అనే ఆలోచన అందరిలోనూ ఉంది. ప్రభుత్వాలు పేదలకు ఊరటగా నిలుస్తున్నాయి. వారికి ఈ వారం రోజుల కోసం ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. అయితే, ప్రభుత్వ సాయం అందనివారు చాలా మంది ఉంటారు. భవన కార్మికులు, రోజువారీ కూలీలు, ఇళ్లల్లో పనిచేసే వారు.. ఇలాంటి వారికి మనవంతుగా సాయం చేయాలని సూచిస్తున్నారు ప్రకాష్ రాజ్. తన వంతు సాయంగా తన ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించానని అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. Also Read: ‘‘జనతా కర్ఫ్యూ... నా నగదు నిల్వను ఒకసారి చూసుకున్నాను. నా ఇల్లు, ఫార్మ్ హౌస్, ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్‌లో పనిచేసే వారికి.. నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశాను. జనసమూహాలకు దూరంగా ఉండాల్సిన నేపథ్యంలో నా మూడు సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ సినిమాలకు పనిచేసే దినసరి కార్మికులకు కనీసం సగం వేతనం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడితో నా పని పూర్తి కాలేదు.. నా శక్తి మేర చేయగలిగినంత ఎక్కువ సాయం చేస్తాను. మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే.. మీ చుట్టూ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. ఒకరి జీవితాన్ని మీరు నిలిపే సమయం ఇది. ఒకరికి ఒకరు అండగా నిలవాల్సిన తరుణం ఇది’’ అని ప్రకాష్ రాజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33GGZZL
No comments:
Post a Comment