Sunday, 22 March 2020

లాక్‌ డౌన్‌తో బతకాలంటే నా మంత్రం ఇదే... తెలుగు డైరెక్టర్ ట్వీట్

కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రం పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు పెద్ద సంఖ్యలో స్పందన వచ్చింది. సినీ సెలబ్రిటీలు సైతం ... మోదీ ఇచ్చిన పిలుపునకు పెద్ద ఎత్తున స్పందించింది. తెలుగు, హిందీ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా చప్పట్లు కొట్టి జనతా కర్ఫ్యూను విజయవంతంగా పాటించారు. అయితే ఇదే సమయంలో తెలుగు సినిమా ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఇవాళ ఓ ట్వీట్ చేశారు. లాక్ డౌన్‌, కరోనా వైరస్ నడుస్తున్న సందర్భంగా ఆమె నెటిజన్లకు ఓ సలహా ఇచ్చారు. ఇలాంటి సమయంలో బతకాలంటే నేను పాటించిన మంత్రం ఇదే అన్నారు. రోజుకు ఒక పూట మాత్రమే తినాలన్నారు. దీని వల్ల ఇంట్లో సరుకులు అయిపోకుండా ఎక్కువరోజులు ఉంటాయన్నారు. అంతేకాకుండా మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందన్నారు. ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే నందిని రెడ్డి ట్వీట్‌పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకపూటే తింటే నీరసం రాదా ? అని ఓ నెటిజన్ ప్రశ్నిస్తుంటే...దానికి నందిని రెడ్డి స్పందించారు. మీరెప్పుడు ఉపవాసం ఉండలేదా ? అని ఆమె బదులిచ్చారు. మరో నెటిజన్ ‘నందిని రెడ్డి సినిమాలు చూడండి కడుపు నిండిపోతుంది ’ అని ట్వీట్ చేశారు. మరో నెటిజన్ ‘ఇది శాస్త్రీజీ యుద్ధం సమయంలో సైన్యానికి చెప్పిన చిట్కా’ ప్రస్తుతం లేటెస్ట్ డైట్ ప్లాన్ కూడా అని పోస్టు పెట్టారు. ‘ ఖాళీగా ఉంటే మరింత ఆకలి వేస్తుంది అక్కా’ అంటూ మరో నెటిజన్ చిలిపిగా సమాధానం ఇచ్చాడు. ఇంకొందరు సూపర్ మంచి డైట్ ప్లాన్... గ్రేట్ థాట్ అంటూ ట్వీట్లు పెట్టారు. మరోవైపు జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా నందిని రెడ్డి చెప్పిన చిట్కాను మెచ్చుకుంది. ఐ లైక్ ఇట్ అంటూ... ఆమె కూడా ట్వీట్ చేసింది. నందిని రెడ్డి పెట్టిన ట్వీట్‌కు అనసూయ బదులిచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33PfbCV

No comments:

Post a Comment

''Have Muslims Faced Problems In Maharashtra?'

'We have given riot-free Maharashtra in our 18-month rule.' from rediff Top Interviews https://ift.tt/pLavVg8