దేశంలో వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే కరోనా కేసుల సంక్య నాలుగువందలకు చేరింది. తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 26కు చేరింది. అటు ఏపీలో కూడా రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఏపీ, తెలంగాణతో పాటు దేశంలో వైరస్ బారిన పడుతున్న ప్రాంతాలు పెరుగుతున్న సమయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో వైరస్ ప్రభావితమైన 75 జిల్లాలను లాక్ డౌన్ చేయాలని కేంద్రం ప్రకటించింది. మరోవైపు 10 రోజుల క్రితం బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న యువకుడకు కరోనా పాజిటివ్ అని టెస్టుల్లో తేలినట్లు సమాచారం. అతడు స్వగ్రామం అయినా గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు శనివారం రాత్రి పల్నాడు రైల్లో చేరుకున్నాడు. అయితే అతడు తెలుగు సినీ పరిశ్రమలో సహాయ నటుడిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇంటికి చేరుకున్న ఆ యువకునికి గత వారం రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు బాధిత యువకుడి తల్లి చెప్పారు. దీంతో వైద్య చికిత్స అందించారు. పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే మొదట ఇతను వైద్య సేవలు చేయించుకునేందు సహకరించలేదని తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వైద్య పరీక్షలు చేయాంచుకోవాలని చెప్పడమే కాకుండా ఆ యువకుడికి అవగాహన కూడా కల్పించారు. వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు, వైద్య బృందం బాధిత యువకుడిని తరలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గుంటూరులో కరోనా అనుమానిత కేసు నమోదు కావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. అతని కుటుంబసభ్యులకు కూడా వైద్య అధికారులు క్వారంటైన్ చేస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3acG0mL
No comments:
Post a Comment