ప్రముఖ తమిళ నటుడు, కథా రచయిత, దర్శకుడు, రంగస్థల నటుడు విసు కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న విసుకు ఆదివారం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విసు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయన మృతదేహాన్ని ఒక్కియంపేట్‌లోని నివాసానికి తరలించారు. సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ఇతరులు నివాళులర్పించడానికి విసు పార్థివదేహాన్ని రేపు ఇంట్లోనే అందుబాటులో ఉంచనున్నారు. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి. విసు డైరెక్టర్ కావడానికి ముందు దిగ్గజ దర్శకుడు కె. బాలచందర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. ఎస్.ముత్తురామన్ దర్శకత్వంలో వచ్చిన ‘కుడుంబం ఒరు కడంబం’ సినిమాతో విసు నటుడిగా మారారు. 60కి పైగా చిత్రాల్లో విసు నటించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా విసు సుపరిచితమే. ‘ఆడదే ఆధారం’ సినిమాతో విసు తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సినిమాలో నటించడమే కాకుండా ఆయనే దర్శకత్వం వహించారు. అక్కినేని నాగేశ్వరరావు ‘గాడ్ ఫాదర్’ చిత్రంలోనూ నటించారు. వీటితో పాటు ‘అరుణాచలం’ లాంటి సూపర్ హిట్ తమిళ డబ్బింగ్ సినిమాల్లో విసు తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. Also Read: కాగా, ఇటీవల విసు ఒక వివాదం ద్వారా వార్తల్లోకి ఎక్కారు. 1981లో వచ్చిన ‘నెట్రికన్’ సినిమాను రీమేక్ చేయనున్నట్లు ధనుష్ ప్రకటించారు. అయితే, ఈ సినిమాను రీమేక్ చేయాలంటే తన అనుమతి తీసుకోవాలని విసు వెల్లడించారు. ఈ సినిమాకు కథ రాసింది విసునే. అయితే, ఈ కథపై విసుకు ఎలాంటి అధికారం లేదని.. దాని హక్కులు తమ వద్ద ఉన్నాయని, పూర్తి అధికారం తమదేనని కవితలయా ప్రొడక్షన్స్ సంస్థ వివరణ ఇచ్చింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UuzEZc
No comments:
Post a Comment