కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశంలో తీవ్రంగా నష్టపోతున్న పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకటి. సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోవడం వల్ల కొన్నివేల మంది సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఇప్పుడు వాళ్లను ఆదుకోవడానికి తమిళ ఇండస్ట్రీ ముందుకొచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సహా పాపులర్ సినీ నటులంతా భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఫిల్మ్ ఎంప్లాయూస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా () యూనియన్‌కు ఈ విరాళాలను అందజేస్తున్నారు. ఇప్పటికే సూర్య, ఆయన తమ్ముడు కార్తి రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ రూ. 50 లక్షల భారీ మొత్తాన్ని ప్రకటించారు. అలాగే, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా రూ. 10 లక్షల విరాళం అందజేశారు. యంగ్ హీరో శివ కార్తికేయన్ కూడా రూ.10 లక్షలు ఇచ్చారు. అయితే, అందరి కన్నా ఎక్కువగా రజినీకాంత్ రూ. 50 లక్షలు విరాళం అందజేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాగా, కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో మార్చి 16 నుంచి తమిళనాడులో షూటింగ్‌లు ఆపేశారు. అప్పటి నుంచి వేలమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో FEFSI అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి (రోజా భర్త) స్టార్ హీరోలందరికీ ఒక విన్నపం చేశారు. 15000 మంది FEFSI వర్కర్లకు బియ్యం బస్తాలు సరఫరా చేయడానికి కోటి రూపాయలు అవసరమని చెప్పారు. అయితే, ఈ మొత్తంలో 50 శాతం రజినీకాంత్ ఒక్కరే డొనేట్ చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bpwzAK
No comments:
Post a Comment