కోరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శక్తిమేర కృషి చేస్తున్నారు. వీరి కృషిని అభినందిస్తూ చాలా మంది సెలబ్రిటీలు ఆర్ధికంగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. రజినీకాంత్, నితిన్ లాంటి స్టార్లు ఇప్పటికే విరాళాలు ప్రకటించి తమ మంచి మనసు చాటుకోగా.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో రాష్ట్రానికి రూ.50లక్షల చొప్పున.. రెండు రాష్ట్రాలు కలిపి రూ.కోటిని ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు. కాగా స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ. 20 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తూ.. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా.. `కరోనాపై పోరాటానికి సహాయపడే క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయనిధులకు రూ.పది లక్షల చొప్పున విరాళం అందించాలని మా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నారని ట్వీట్ చేశారు వంశీ. కాగా కరోనా ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థికంగా కుదేలయ్యాయి. ఈ సందర్భంలో ఇంట్లో నుంచి బయటకు రాకుండా కట్టడి చేసేందుకు వారి తిండి, నిత్యవసర వస్తువుల కోసం ఒక్కో కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 1500 వందలు, బియ్యం ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 రూపాయిలు, రేషన్ సరుకుల్ని ప్రకటించింది. వీటికోసం ప్రభుత్వాలపై దాదాపు 3 వేల కోట్లు అదనపు భారం కాగా.. కరోనా నివారణ చర్యలకు మరో 10 వేల కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఈ అదనపు ఖర్చులు రాష్ట్రాలకు తలకుమించిన భారం కావడంతో దాతలు ముందుకు వచ్చి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సాయ పడాలని కోరుతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3amDc6q
No comments:
Post a Comment