Friday, 20 September 2019

‘గద్దలకొండ గణేశ్’ ఫస్ట్‌డే కలెక్షన్స్.. వరుణ్ తేజ్ ఇరగదీసిండు

సినిమా విడుదల అవడానికి ఒక రోజు ముందు టైటిల్ మార్చాల్సిందిగా చిత్రబృందానికి షాక్. చేసేదేంలేక ‘వాల్మీకి’ని కాస్తా ‘గద్దలకొండ గణేశ్’ అని మార్చారు. టైటిల్ వల్ల నిజంగానే కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయో లేక కావాలని చేశారో తెలీదు కానీ చివరి నిమిషంలో దర్శకుడు హరీశ్ శంకర్‌కు షాకిచ్చారు. టైటిల్‌ని మార్చగలిగారు.. కానీ సినిమా కంటెంట్‌ని కాదు. అందుకే దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘గద్దలకొండ గణేశ్’ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుకుంది. ఒక్కరోజులోనే సినిమా సూపర్ హిట్ అని తేల్చేశారు. దీని గురించి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘టైటిల్‌లో మార్పులు చేయడం వల్ల ఎవరికి నష్టం కలిగిందో ఎవరికి లాభం కలిగిందో తెలీడం లేదు. కానీ చివరికి నా సినిమా బాక్సాఫీస్ వద్ద గెలిచింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ నాకు ఫోన్ చేసి సినిమా విజయం సాధించినందుకు కంగ్రాట్స్ చెప్పారు’ అని వెల్లడించారు. ‘గద్దలకొండ గణేశ్’ తొలి రోజు వసూళ్లు నైజాం- 1.6 కోట్లు సీడెడ్- 60 లక్షలు యూఏ- 60 లక్షలు వెస్ట్- 50 లక్షలు ఈస్ట్- 50 లక్షలు కృష్ణ- 30 లక్షలు గుంటూరు- 45 లక్షలు నెల్లూరు- 15 లక్షలు మొత్తానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజు రూ.4.7 కోట్ల వసూళ్లు రాబట్టిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. చివరి నిమిషంలో టైటిల్‌లో మార్పులు చేయడంతో చిత్రబృందం చాలా బాధపడింది. ముఖ్యంగా దర్శకుడు హరీశ్ శంకర్. తొలిసారి తనకు ఓడిపోయినట్లు అనిపిస్తోందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. సినిమా విడుదల ముందు రోజు వరకు ‘వాల్మీకి’ టైటిల్‌తో బాగా ప్రచారమైన ఈ సినిమా ఒక్కసారిగా ‘గద్దలకొండ గణేశ్’గా విడదలయ్యే సరికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారో లేదో అన్న సందేహం చిత్ర వర్గాల్లో మొదలైంది. ఏదైతేనేం.. తొలి రోజే బొమ్మ హిట్టు అంటూ ప్రేక్షకులు రిపోర్ట్ కార్డ్ ఇచ్చేశారు. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘జిగర్తాండ’ సినిమాకు ‘గద్దలకొండ గణేశ్’ రీమేక్‌గా వచ్చింది. వరుణ్ తేజ్‌, పూజా హెగ్డే జంటగా నటించారు. తమిళ నటుడు అథర్వా మురళి కీలక పాత్రను పోషించారు. మొత్తానికి మెగా ప్రిన్స్ వరుసగా మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా ఫ్లాపవడంతో కాస్త బాధలో ఉన్న హరీశ్ శంకర్‌కు ‘గద్దలకొండ గణేశ్’ కొత్త ఉత్సాహానిచ్చాడు. ఇక ఇప్పట్లో బాక్సాఫీస్ వద్ద సినిమా వసూళ్ల జోరు తగ్గేలా లేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LFyK8X

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....