సినీ రచయిత, నిర్మాత, దర్శకుడు కోన వెంకట్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఆయనపై జెమినీ ఎఫ్‌ఎక్స్ డైరెక్టర్ ప్రసాద్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కథ ఇస్తానని చెప్పి 2017లో రూ.18.50 లక్షలు తీసుకున్నారని.. కథ ఇవ్వకపోగా, డబ్బులు అడిగితే బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రసాద్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కోన వెంకట్‌పై 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పీవీ ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించిన ఓ ట్వీట్‌తో కోన వెంకట్ ఇటీవల వార్తల్లో ప్రముఖంగా నిలిచిన సంగతి తెలిసిందే. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వెళ్లేందుకు, సిటీ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లేందుకు ప్రయాణికులు ఉపయోగించే పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే డ్యామేజ్ అయ్యింది. పిల్లర్ నంబర్ 20 వద్ద పీవీ పెచ్చులూడి, పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. కోన వెంకట్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా.. జీహెచ్ఎంసీ, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. Must Read: అమీర్‌పేట్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర పెచ్చులూడిపడి మహిళ మృతి చెందిన భాగ్యనగరంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఫ్లై ఓవర్లు, మెట్రో రైల్వే నిర్మాణాలపై పడింది. ఈ క్రమంలో కోన వెంకట్.. పీవీ ఎక్స్‌ప్రెస్ వే విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఎలాంటి ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2npEf21
No comments:
Post a Comment