Sunday, 29 September 2019

స్నేహారెడ్డి బర్త్‌డే.. భార్యకు బన్నీ స్వీట్ విషెస్

టాలీవుడ్‌లోని క్యూటెస్ట్ కపుల్ జాబితాలో ముందు వరుసలో ఉన్న జంట , స్నేహారెడ్డి. ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. పెళ్లిచేసుకున్న వీరు అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. బన్నీ సినిమాలతో బిజీబిజీగా గడుపుతుంటే.. స్నేహ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. అయితే, ఆదివారం స్నేహారెడ్డి తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు బన్నీ స్వీటెస్ట్ విషెస్ చెప్పారు. చాలా సింపుల్‌గా.. ‘‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’’ అని ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన భార్యను హత్తుకుని తీసుకున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. కాగా, అల్లు అర్జున్-స్నేహారెడ్డిల వివాహ బంధానికి ఎనిమిదేళ్లు. మార్చి 6న వీరిద్దరూ తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. 2011 మార్చి 6న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో బన్నీ, స్నేహల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారి ప్రేమకు ప్రతిరూపంగా 2014 ఏప్రిల్ 4న అయాన్ జన్మించాడు. 2016లో కూతురు అర్హ జన్మించింది. Also Read: ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల... వైకుంఠపురములో...’ అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. తాజాగా ఈ సినిమాలోని తొలిపాటను విడుదల చేశారు. ‘సామజవరగమన’ అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2m2HH2d

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...