Saturday, 28 September 2019

Venu Madhav: ఆ రాత్రి.. వేణు మాధవ్ నేను ఒకే బెడ్‌పై పడుకున్నాం.. అతను ఇలా చేశాడు: షకీలా

‘రాత్రి పూట, లైట్స్ అన్నీ బంద్‌లో ఉన్నాయి. వేణు నా బెడ్‌పై పడుకుని నిన్ను ఒకటి అడుగుతూ కాదనకూడదు.. అని హస్కీ వాయిస్‌తో అడుగుతుంటుంటే.. ఏంట్రా నీ ప్రాబ్లమ్ అని గట్టిగా అడిగా. ఆ టైంలో వేణు ఏం చేస్తున్నాడంటే’.. అంటూ చిలిపి చేష్టలను తలుచుకుంటూ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు శృంగార తార . వేణు మాధవ్ అకాల మరణంతో ఇండస్ట్రీ మొత్తం ఆయనతో ఉన్న తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఇటీవల ‘కొబ్బరి మట్ట’ చిత్రంలో నటించిన షకీలా.. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. వేణు మాధవ్ స్నేహానికి ఎంత విలువనిస్తాడో ఒక సంఘటన ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ‘వేణు నేను ఓ సినిమా షూటింగ్‌కి వెళ్లాం.. అక్కడ బ్రహ్మానందం, రఘుబాబు ఇలా చాలామంది ఉన్నారు. బయట నుండి చాలా మంది ఆడియన్స్ మమ్మల్ని చూడటానికి హోటల్‌కి వచ్చేవారు. ఆ టైంలో వేణు నా గదిలోనే ఉన్నాడు. అప్పుడు ఒకడొచ్చి బెడ్ మీద పడి వేణుతో మాట్లాడుతున్నాడు. వాళ్లు రూంలు వాళ్లు క్లీన్‌గా ఉంచుకునేవాళ్లు. నా రూమ్‌‌ మాత్రం దరిద్ర్యం చేసేవాళ్లు. అందుకే నా రూమ్ నీట్‌గా లేకపోవడంతో వేణు.. నీ రూంకి వస్తా పడుకుంటా అని అడిగా. సరే రా అన్నాడు. ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద పడుకున్నాం. కాసేపు అయిన తరువాత ఎవరో ఏదో చేస్తున్నారనే డిస్టబెన్స్ అనిపించింది. టీవీ అద్దంపై ఒక షాడోలా కనిపిస్తుంది. ఆ టైంలో వేణు మాధవ్.. ‘నేను నిన్ను ఒక మాట అడగనా.. నిన్ను ఒకటి అడుగుతా దానికి ఒప్పుకుంటావా? అన్నాడు. అరే.. నేను ఫ్రెండ్ అని వచ్చానే.. నిజంగా తప్పుగా అడిగితే మా మధ్య ఫ్రెండ్ షిప్ ఉండదనుకుని.. సరే అడిగి చావు అన్నాను. నువ్ దానికి నో చెప్పకూడదు.. అంటూ హస్కీ వాయిస్‌‌తో మాట్లాడుతున్నాడు. రాత్రి పూట, లైట్స్ అన్నీ బంద్‌లో ఉన్నాయి. వేణు నా బెడ్‌పై పడుకుని దానికి ఒప్పుకుంటావా? అని అడుగుతుంటుంటే.. ఏంట్రా నీ ప్రాబ్లమ్ అని గట్టిగా అడిగా. ఆ టైంలో వేణు ఏం చేస్తున్నాడంటే.. మా ఇద్దరి మధ్యలో అడ్డుగా పిల్లోలు (తలదిండులు) పెడుతున్నాడు. ఏం రా.. ఇది అంటే.. ‘ఏం లేదు.. నాకు పెళ్లై ఇద్దరు బిడ్డలు ఉన్నారు తెలుసు కదా నీకు.. వాళ్లు బాగుండాలంటే నేను బతికి ఉండాలి.. నువ్ నిద్రలో నీ పెద్ద పెద్ద కాళ్లు తీసి నాపై వేస్తే బతకడం కష్టం. నువ్ కాళ్లు వేయాలనుకుంటే ఆ తలదిండులపై వేసుకో’ అని అన్నాడు. దానికి నేను నైట్ అంతా నవ్వి.. నెక్స్ట్ డే కూడా నవ్వుతూనే ఉన్నా. ఈ విషయం బ్రహ్మానందం, రఘు అందరికీ చెప్పేశా. ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే.. నేను తప్పుగా అనుకున్నానే అని బాధపడ్డా’ అంటూ వేణు మాధవ్ గురించి చెప్పుకొచ్చింది షకీలా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2movBRp

No comments:

Post a Comment

'Please Save My Mum'

'Doctors feel they have a duty to prolong a heartbeat at all costs.' from rediff Top Interviews https://ift.tt/2TnvHrW