Sunday 29 September 2019

పవన్ కళ్యాణ్‌కి అమితాబ్ ప్రశంసలు..ఒక సెటైర్ కూడా

ప్రమోషన్స్ కోసం చాలా టైమ్ కేటాయించారు. అలాగే చరణ్ కూడా దగ్గరుండి మరీ ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాలకు హార్ట్ లాంటిది బాలీవుడ్ మార్కెట్. కనీసం అక్కడివాళ్లను మెప్పించగలిగినా కూడా సినిమా సేఫ్ అయిపోతుంది. అంత స్టామినా ఉన్న మార్కెట్ అది. అందుకే అక్కడ అమితాబ్‌తో కలిసి ఒక ఇంటర్వ్యూ‌లో పాల్గొన్నారు చిరు. అయితే ఆ ఇంటర్వ్యూ అంతా కూడా ఎదో రొటీన్‌గా కాకుండా చాలా సరదాగా సాగింది. చిరు చాలా ఫార్మల్‌గా మాట్లాడుతున్నా కూడా అమితాబ్ మాత్రం తన స్పాంటేనిటీతో, తన మార్క్ చమక్కులతో నవ్వించారు. Also Read:

అయితే ఆ ఇంటర్వ్యూ‌లో సైరా అనేది చిరంజీవి సినిమా మాత్రమే కాదు ఆ సినిమాలో మొత్తం చిరంజీవి కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పుకొచ్చారు బిగ్ బి. 'చిరంజీవి తనయుడు చరణ్, అలాగే కూతురు సుస్మిత కూడా సినిమాకోసం పనిచేసారు. ఆమె టాలెంట్ చూసి ఆమెకి కాంప్లిమెంట్స్ ఇచ్చాను' అని చెప్పారు. ఆ సందర్భంలో చిరంజీవి సైరా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 'ఈ సినిమాకోసం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ వాయిస్ ఇచ్చాడు... సినిమా స్టార్టింగ్‌లో ఎండింగ్‌లో కూడా వాయిస్ వస్తుంది, అతని వాయిస్ కూడా ఈ సినిమా గురించి చాలా చెబుతుంది' అని చెప్పగానే అమితాబ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. 'తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. అక్కడ అతనికి హ్యుజ్ ఫాలోయింగ్ ఉంది' అంటూ పవన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు అమితాబ్. Also Read: ఇక ఇంటర్వ్యూ మొదట్లో చిరంజీవి తో తన పరిచయాన్ని గుర్తుచేసుకుంటున్న క్రమంలో అమితాబ్ అప్రయత్నంగానే చిరంజీవి‌ పై ఒక కౌంటర్ వేశారు. తర్వాత రజినీ కాంత్, పవన్ కళ్యాణ్‌లకు కూడా దాన్ని ఆపాదించారు. 'నేను చిరంజీవికి చాలా సలహాలు ఇస్తుంటాను, కానీ అవేమీ ఆయన పాటించరు. రాజీకీయాల్లోకి వెళ్లొద్దు అని చెప్పాను.రజినీ కాంత్‌కి చెప్పాను...కొంతకాలం తర్వాత చిరు రాజకీయాల్లో నుండి తిరిగివచ్చేసా అన్నాడు, కానీ తరువాత వాళ్ళ తమ్ముడు వెళుతా అంటే అతనికి కూడా చెప్పాను...వినలేదు...అతను రాజీకీయాల పట్ల చాలా ఆసక్తి కలిగిఉంటాడు'' అని నవ్వేసారు. దానికి చిరు స్పందిస్తూ ''నేను రాజకీయల్లోకి వెళ్లినందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ అర్హత కలిగి ఉన్నాడు'' అంటూ సపోర్ట్ చేశారు. Also Read: ఎప్పుడు చిరు, పవన్ కలవకపోయినా మెగా ఫ్యామిలీలో కలతలు అని రాసేసేవాళ్లకు ఆ ఛాన్స్ లేకుండా చేసాడు చిరంజీవి. సైరాకి వాయిస్ చెప్పినందుకు నేషనల్ మీడియాలో సైతం అతన్ని హైలైట్ చేసి, పవర్ స్టార్ అంటే తనకు ఎంత ప్రేమ అనేది చెప్పకనే చెప్పాడు. సైరా సినిమాని బాలీవుడ్‌కి చేరువ చెయ్యాలి అనే ఆ టీమ్ ప్రయత్నం ఈ ఒక ఒక్క ఇంటర్వ్యూ‌తో ఫుల్‌ఫిల్ అయ్యింది. అలుపులేకుండా సైరా టీమ్ చేస్తున్న ప్రమోషన్స్‌తో అక్టోబర్ 2న బాక్సాఫీస్ దగ్గర సైరా సంచలనాలు మామూలుగా ఉండవు అనే క్లారిటీ అయితే వచ్చేసింది. అది ఏ రేంజ్ చరిత్ర సృష్టిస్తుంది అనేది మాత్రం చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2nG2Q2y

No comments:

Post a Comment

'Kashmir Needs A Bal Thackeray'

'Afzal Guru became a victim of Pakistan's conspiracy. He was used as a means, just like all other innocent Kashmiris.' from re...