Friday 27 September 2019

‘అల.. వైకుంఠపురములో..’ తొలి మెలొడీ వచ్చేసింది సిద్ శ్రీరామ్ మళ్లీ చించేశాడు

స్టైలిష్ స్టార్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మరో చిత్రం ‘అల..వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని తొలి మెలొడీ పాట అయిన ‘సామజవరగమన’ వీడియో సాంగ్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఎస్.ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ‘ఉండిపోరాదే’ పాటతో ఫేమస్ అయిపోయిన సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. వీడియోలో తమన్ పియానో వాయిస్తుండగా శ్రీరామ్ పాట ఆలపిస్తూ కనిపించారు. ‘నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.. నీ కళ్లకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు..నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు’ అంటూ సాగుతున్న ఈ పాట వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది. తమన్ ఎప్పుడూ తన మ్యూజిక్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తారు. ఇక సిద్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పాట కాబట్టి మంచి క్రేజ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఇక అల్లు అర్జున్, పూజా హెగ్డే కెమిస్ట్రీ ఈ పాటకు కలిస్తే ఆ కిక్కే వేరు. వీడియో మధ్యలో సినిమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే, రాహుల్ రామకృష్ణ, నవదీప్ మధ్య వచ్చే సన్నివేశాలను చూపించారు. ఈ పాటకు ప్రముఖ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ఆయన సాహిత్యం అంటే త్రివిక్రమ్ ఎనలేని అభిమానం. అందుకే తన సినిమాల్లో అన్ని పాటలకు కాకపోయినా కొన్ని పాటలకైనా సిరివెన్నెల చేత సాహిత్యం రాయించుకుంటారు. ఈ చిత్రంలో టబు, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సుశాంత్, వెన్నెల కిశోర్, సునీల్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సచిన్ ఖెడేకర్ కీలక పాత్రలు పోషించారు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల..వైకుంఠపురములో సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అందుకే ఇప్పటినుండి ఆ సినిమాకి ఫుల్‌గా బజ్ పెంచే పనిలో బిజీ అయ్యారు. సినిమా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఉంటుందని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2nl3S48

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz