
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఆ సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై కత్తి దూయనున్నారు. టాలీవుడ్ రికార్డుల దుమ్ము దులపనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సైరా’ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. తాజాగా విడుదలైన ‘సైరా’ టైటిల్ సాంగ్ వీడియో ఆ అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఆ వీడియో సాంగ్‌లో విజువల్స్ అద్భుతం అనిపిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ‘బాహుబలి’ తరవాత మరో ఆణిముత్యంగా ‘సైరా’ నిలిచిపోతుంది అనిపిస్తుంది. తెలుగు గడ్డపై మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు, రేనాటి సూరీడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథను ‘సైరా నరసింహారెడ్డి’గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవికిషన్ కీలకపాత్రల్లో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం సమకూర్చారు. ఇటీవల ఈ సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. అప్పుడే, పాట అద్భుతంగా ఉందని అంతా కొనియాడారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని ఈ పాటకు అందించారు. అయితే, ఇప్పుడు ఈ పాట వీడియోను విడుదల చేశారు. విజువల్స్ పాటకు తగ్గట్టుగా అద్భుతంగా ఉన్నాయి. నయనతార, తమన్నా సైతం చాలా హుందాగా రాజబిడ్డల్లా మెరిసిపోతున్నారు. మొత్తంగా ఈ వీడియో సాంగ్ చాలా గ్రాండియర్‌గా ఉంది. పాటే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉండబోతోందో అని మెగా అభిమానుల్లో ఆత్రుత మరింత పెరిగిపోవడం ఖాయం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2n3reeL
No comments:
Post a Comment