Sunday, 29 September 2019

‘రొమాంటిక్’ ప్రీ లుక్: పూరి భుజాలపై పోరి!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘మెహబూబా’ సినిమా ద్వారా తన కుమారుడు ఆకాశ్ పూరిని సోలో హీరోగా పరిచయం చేశారు. ఈ సినిమాకు పూరి జగన్నాథే దర్శకుడు, నిర్మాత. ఛార్మి సహనిర్మాతగా పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమాకు పూరి మంచి హైప్ క్రియేట్ చేసినా అంచనాలను అందుకోవడంతో ఘోరంగా విఫలమైంది. దీంతో, తన సినీ వారసుడిగా ఆకాశ్‌ను నిలబెట్టే సినిమా ఇవ్వాలని మరో చిత్రాన్ని పూరి నిర్మిస్తున్నారు. ఆకాశ్ పూరి హీరోగా నటిస్తోన్న రెండో చిత్రం ‘రొమాంటిక్’. కేతిక శర్మ హీరోయిన్. అనిల్ పాదురి దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ సోమవారం ఉదయం 11 గంటలకు విడుదలకానుంది. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా, ‘రొమాంటిక్’ ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ఈ ప్రీ లుక్ పోస్టర్‌లో ఆకాశ్ పూరి భుజాలపై ఢిల్లీ పోరి కేతిక శర్మ దర్జాగా కూర్చుంది. ఆకాశ్ ఆమెను మోసుకుంటూ బీచ్‌లో హాయిగా నడుస్తున్నాడు. ‘‘లవ్ బర్డ్స్.. బీచ్‌లో విహరిస్తున్నారు’’ అని ఈ పోస్టర్‌కు పూరి జగన్నాథ్ క్యాప్షన్ కూడా పెట్టారు. కాగా, ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు. భాస్కరభట్ల సాహిత్యం అందిస్తున్నారు. Also Read: కాగా, ‘ఇస్టార్మ్ శంకర్’ సినిమా షూటింగ్ సమయంలోనే ‘రొమాంటిక్’ మూవీ షెడ్యూళ్లను కూడా పూర్తిచేశారు. గోవాలో ఈ రెండు చిత్రాలను ఒకేసారి చిత్రీకరించారు. గోవా పరిసర ప్రాంతాల్లో 45 రోజుల పాటు ‘రొమాంటిక్’ సినిమాకు సంబంధించి సన్నివేశాలను చిత్రీకరించినట్లు అప్పట్లో ఛార్మి వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పూరి, ఛార్మి.. ఈ ‘రొమాంటిక్’తో ఎలాంటి హిట్ కొడతారో చూడాలి..!


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2olshHf

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....