Wednesday, 25 September 2019

‘సైరా’ ట్రైలర్ 2: గడ్డిపరక కూడా గడ్డ దాటకూడదు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం సమకూర్చారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం వచ్చేనెల 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదలవుతోంది. ఇప్పటికే విడులైన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పుడు మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాలోని ప్రధానమైన యుద్ధ సన్నివేశాలను మచ్చుకగా చూపిస్తూ ఈ ట్రైలర్‌ను రూపొందించారు. ట్రైలర్‌లో చిరంజీవి చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే వెండితెరపై నరసింహారెడ్డి సమరసింహపై ఆంగ్లేయులను చీల్చి చండాలడం ఖాయంగా కనిపిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2mNEAv4

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....