Wednesday 25 September 2019

లక్ష్మీనగర్ శ్మశాన వాటికలో వేణుమాధవ్ అంత్యక్రియలు

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం మౌలాలీలోని లక్ష్మీనగర్ శ్మశాన వాటికలో జరగనున్నాయి. గతకొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణుమాధవ్.. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి నిన్న సాయంత్రం వేణుమాధవ్ పార్థీవదేహాన్ని మౌలాలీని హెచ్‌బీ కాలనీలో ఉన్న ఆయన ఇంటికి తరలించారు. అక్కడే చాలా మంది ప్రముఖులు వేణుమాధవ్‌కు నివాళులర్పించారు. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఈరోజు మధ్యాహ్నం వేణుమాధవ్ పార్థీవదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నారు. ఇప్పటికే మౌలాలి నుంచి వేణుమాధవ్ పార్థీవదేహంతో వాహనం ఫిల్మ్ నగర్‌కు బయలుదేరింది. ఫిల్మ్ ఛాంబర్‌లో గంటన్నర పాటు వేణుమాధవ్ పార్థీదేహాన్ని ఉంచనున్నారు. ఈ సమయంలో సినీ పరిశ్రమకు చెందినవారంతా నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల తరవాత మళ్లీ పార్థీవదేహాన్ని మౌలాలీకి తీసుకెళ్తారు. అక్కడ లక్ష్మీనగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. Also Read: కోదాడలో జన్మించిన వేణుమాధవ్ మౌలాలీలో స్థిరపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా మారినప్పటికీ ఆయన ఫిల్మ్ నగర్ వైపు రాకుండా మౌలాలీలోనే ఉండిపోయారు. దీనికి కారణం అక్కడి వాళ్లతో ఆయనకు ఏర్పడిన అనుబంధం. మౌలాలీలోని హెచ్‌బీ కాలనీ వాసులతో వేణుమాధవ్‌కు మంచి అనుబంధం ఉంది. ఆ కారణంతోనే ఆయన ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి రాలేదు. ఇప్పుడు వేణుమాధవ్ మరణంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2mOCCur

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz