భారతీయ చలన చిత్ర పితామహుడిగా పేరొందిన దాదా సాహెబ్ ఫాల్కే 150వ జయంతి సందర్భంగా ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముంబయి, దిల్లీలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. తొలిసారిగా హైదరాబాద్‌లో అవార్డుల ప్రదానోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ హాజరయ్యారు. కాగా.. ‘భరత్ అనే నేను’ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా మహేశ్ బాబుకు అవార్డు దక్కింది. గవర్నర్ తమిళసై చేతుల మీదుగా మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఈ అవార్డును అందుకున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. ఎన్ కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ తారలు మంచు లక్ష్మి, అవికా గోర్, సంపూర్ణేశ్‌బాబు తదితరులు హాజరయ్యారు. దాదా సాహెబ్ ఫాల్కే సౌథ్ అవార్డులు అందుకున్నవారు వీరే.. ఉత్తమ దర్శకుడు- సుకుమార్ (రంగస్థలం) ఉత్తమ నటుడు-మహేశ్ బాబు (భరత్ అనే నేను) ఉత్తమ నటి- అనుష్క (భాగమతి) బెస్ట్ డెబ్యూ (ఫీమేల్)- పాయల్ రాజ్‌పుత్ (ఆర్ ఎక్స్ 100) ఔట్ స్టాండింగ్ పర్‌ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ (ఫీమేల్)- కీర్తి సురేశ్ (మహానటి) ఔట్ స్టాండింగ్ పర్‌ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ (మేల్)- యశ్ (కేజీఎఫ్) ఉత్తమ సంగీత దర్శకుడు- దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్-రత్నవేలు (రంగస్థలం) ఉత్తమ నటుడు (నెగిటివ్ రోల్)- జగపతిబాబు (అరవింద సమేత వీర రాఘవ)
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30CHzVx
No comments:
Post a Comment