Sunday 22 September 2019

బన్నీ 'అ..ఆ'...మరి మహేష్ ఎప్పుడో ?

సంక్రాంతి సీజన్ అనేది తెలుగు సినిమాలకు నిజంగా పెద్ద పండుగే. ఈ సీజన్‌లో రిలీజ్ అయిన సినిమాల్లో కంటెంట్ కాస్త బావుంది అంటే పెట్టిన డబ్బులు సేఫ్. అదే ప్రేక్షకులను కొంచెం ఎంటర్టైన్ చెయ్యగలిగితే ఇక కాసుల పంటే. అందుకే పెద్ద సినిమాలు మాత్రమే కాదు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా సంక్రాంతిని టార్గెట్ చేస్తుంటాయి. ఈసారి కూడా తెలుగు నుండి మూడు సినిమాలు సంక్రాంతి రిలీజ్ టార్గెట్‌గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. సినిమా 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్-త్రివిక్రమ్‌ల 'అల..వైకుంఠపురములో' ,కళ్యాణ్ రామ్ నటిస్తున్న 'ఎంత మంచివాడవురా'...సినిమాలు 2020 సంక్రాంతికి వస్తున్నాయి. Also Read: అయితే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మాత్రమే సంక్రాంతికి పక్కా అనే విధంగా ఫాస్ట్ ఫాస్ట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. దాంతో అసలు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే కన్ఫ్యూషన్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఎట్ట్టకేలకు పొంగల్ బరిలో నిలిచే సినిమాలపై క్లారిటీ వచ్చింది. సినిమా 'అల..వైకుంఠపురములో' సినిమాని జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ఆ సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే ఆ రోజు ఆదివారం. ఎంతపండుగయినా మరీ ఆదివారం సినిమా రిలీజ్ డేట్‌గా ఎందుకు అనౌన్స్ చేసారు అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్. అల...వైకుంఠపురములో...ఆదివారం రిలీజ్...అంటే షార్ట్ కట్‌లో అ..ఆ అనుకోవచ్చు. ఇక 'శతమానం భవతి' లాంటి నేషనల్ అవార్డు మూవీ రూపొందించిన సతీష్ వేగేశ్న, కళ్యాణ్ రామ్‌తో జతకట్టి తెరకెక్కిస్తున్న 'ఎంతమంచివాడవురా' షూటింగ్ కూడా దగ్గరపడింది. అందుకే ఆ సినిమాని జనవరి 15న రిలీజ్ చెయ్యబోతున్నారు. Also Read: మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ కాకపోయినా జనవరి 10న ఆ సినిమా రిలీజ్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. ఇన్నాళ్లు బాలకృష్ణ-కె.ఎస్.రవికుమార్‌ల సినిమా కూడా సంక్రాంతికి వస్తుంది అని టాక్ వినిపించింది. కానీ ఆ సినిమా సంక్రాంతికి ముందే రిలీజ్ అవుతుంది. బాలయ్యకి సంక్రాంతి సెంటిమెంట్ కాబట్టి ఆ రూమర్ వచ్చినట్టుంది. అయితే గత సంక్రాంతికి తెలుగు సినిమాలతో పోటీ పడుతూ 'పేట' సినిమా రిలీజ్ చేసిన రజినీ కాంత్ ఈ సంక్రాంతికి కూడా మురుగ దాస్ తెరకెక్కిస్తున్న 'దర్బార్'తో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాకి కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది. మొత్తానికి ఈ పెద్ద పండగకి కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించడానికి రెడీ అయిపోతున్నారు మన హీరోలు.ప్రేక్షకులుకూడా గెట్ రెడీ. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30fhTD9

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...