ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తోన్న చిత్రం ఫస్ట్‌లుక్ విడులైంది. హిందీలో ‘మన్ బైరాగి’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘మనోవిరాగి’ పేరిట విడుదల చేస్తున్నారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫస్ట్‌లుక్ పోస్టర్లను తన అభిమానులు, తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘‘ఈ ప్రత్యేకమైన రోజున ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీద మరో ప్రత్యేకమైన ఫిల్మ్ మేకర్ ఒక ప్రత్యేకమైన సినిమాను ప్రకటించారు. నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంజయ్ లీలా భన్సాలీ, మహవీర్ జైన్‌ల ‘మన్ బైరాగి’ సినిమా ఫస్ట్‌లుక్‌ను నేను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రధాన మంత్రి మోదీ గురించి ప్రజలకు తెలియని కథ ఇది. సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తారు’’ అని ప్రభాస్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Qh0JAc
No comments:
Post a Comment