Saturday, 24 August 2019

Disco Raja: ఇతనెవరు ‘డిస్కోరాజా’.. రవితేజలా ఉన్నాడే! వైరల్ పిక్

ఈ ఫొటో చూస్తుంటే ఇతనెవరు? రవితేజలా ఉన్నాడే అనుకుంటారు తప్ప అతను రవితేజే అని గుర్తుపట్టేవారు చాలా తక్కువ మంది. ‘డిస్కోరాజా’ సినిమా కోసం తన గెటప్‌ని పూర్తిగా మార్చేశారు. ఆ చిత్రానికి సంబంధించి రవితేజ మేకోవర్ ఎంతలా ఛేంజ్ చేశారో.. ఈ ఫొటోని బట్టి చెప్పేయొచ్చు. ప్రస్తుతం రవితేజకు సంబంధించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఆ ఫొటో నిజం కాదని.. అది రవితేజ ఫేక్ ఫొటో.. ఫొటోషాప్ చేశారని కొందరు అంటుంటే.. కొత్తగా వచ్చిన ఫేస్ యాప్ ఫొటో అది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంలో ముసలాడిలా కనిపించిన రవితేజ.. ఇప్పుడు సడెన్‌గా ‘సింధూరం’ రవితేజలా మారిపోవడం ఏంటి? ఇది ఖచ్చితంగా ఫేక్ ఫొటోనే అంటూ భిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ప్రయోగాత్మక చిత్రాలకు రెడీగా ఉండే రవితేజ సరైన కథ పడకపోవడంతో వరస పరాజయాలతో చవిచూస్తున్నారు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఈ చిత్రాన్ని చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే తన మేకోవర్ ఏ రేంజ్‌లో ఉందే చెప్పేందుకు ఈ ఫొటోను వదిలినట్టు తెలుస్తోంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ‘డిస్కోరాజా’ చిత్రంలో రవితేజ వైవిధ్యభరిత పాత్రలో కనిపించబోతున్నారు. యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపంచబోతున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ ఈ చిత్రంలో మాస్ రాజాతో జోడీ కడుతుండగా.. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NtzxeD

No comments:

Post a Comment

'If We Are A Global Power It's Because Of Him'

'A man who brought about the greatest set of economic reforms in the country, who changed the course of Indian history, cannot be consid...