Sunday, 25 August 2019

ప్రభాస్‌తో అనగానే యస్ అనేసా.. ‘సాహో’లో మరో బాలీవుడ్ సుందరి

‘సాహో’ సినిమాలో సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే, మరో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక పాటలో ప్రభాస్‌తో ఆడపాడింది. ప్రభాస్, జాక్వెలిన్ ఆడిపాడిన ‘బ్యాడ్ బోయ్’ సాంగ్ ఇప్పటికే విడుదలైంది. ఈ పాటలో జాక్వెలిన్ అందాలు, ప్రభాస్ హ్యాండ్‌సమ్ లుక్ చేసి వహ్వా అన్నారు. ఈ వీడియో సాంగ్ ప్రోమో మిలియన్ల కొద్ది వ్యూస్ కూడా రాబట్టింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో మరో బాలీవుడ్ భామ కూడా నటించింది. పలు హిందీ సినిమాల్లో నటించిన జర్మన్ మోడల్ ఎవెలిన్ శర్మ.. ‘సాహో’ సినిమాలో ఒక పాత్ర చేసింది. ఆ పాత్ర ఏమిటో తెలీదు కానీ, దర్శకుడు సుజీత్ అడిగిన వెంటనే తాను కాదనలేకపోయానని ఎవెలిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాను ‘బాహుబలి’కి వీరాభిమానినని చెప్పింది. ‘‘హీరో!! బాహుబలికి పెద్ద ఫ్యాన్ అయిన నేను ప్రభాస్‌తో కలిసి పనిచేయడాన్ని ఎంత బాగా ఆస్వాదించుంటానో ఊహించుకోండి. ‘సాహో’లో నటిస్తారా అని సుజీత్ నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు, నేను చెప్పిన ఒకే ఒక్క సమాధానం: యస్!!!’’ అని ఎవెలిన్ శర్మ ట్వీట్ చేసింది. అలాగే, ప్రభాస్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేసింది. కాగా, ‘సాహో’ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 51 నిమిషాలు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఈ చిత్రం ఒకేసారి విడుదలవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేకర్‌తో పాటు తమిళ నటుడు అరుణ్ విజయ్, మలయాళ నటుడు లాల్ కీలక పాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం సమకూర్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LdywEW

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....