‘జబర్దస్త్’ యాంకర్, నటి అనసూయకు సోషల్ మీడియాలో క్రేజ్ అంతా ఇంతా కాదు. తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అనసూయ హీట్ పెంచేస్తోంది. ఈ ఫొటోలకు ఫిదా అయిపోతున్న ఆమె అభిమానులు సూపర్, సెక్సీ, క్యూట్ అంటూ కామెంట్ల మీద కామెంట్లు పెట్టేస్తున్నారు. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘జబర్దస్త్’ కామెడీ షో ప్రసారమయ్యే రోజు (ప్రతి గురువారం) అనసూయ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతుంది. ఆరోజు ‘జబర్దస్త్’లో తాను కనిపించే లుక్‌ను ముందుగానే సోషల్ మీడియా ద్వారా రివీల్ చేస్తుంది. ఇక ఏముంది ఈ ఫొటోల్లో హాట్ హాట్‌గా ఉన్న అనసూయను బుల్లితెరపై చూడటానికి జనాలు ఆసక్తి చూపిస్తారు. ఇదొక స్ట్రాటజీ అనుకోండి. ఈ స్ట్రాటజీల మాట ఎలా ఉన్నా అనసూయ ఫొటోలు మాత్రం ఆమె అభిమానులకు నేత్రానందాన్ని ఇస్తున్నాయి. ఈరోజు అనసూయ షేర్ చేసిన ఫొటోలు కూడా అంతే. రెడ్ కలర్ చెక్ షర్ట్.. దానికింద సగం చిరిగిన స్కర్ట్. ఈ డ్రెస్‌లో కూర్చొని అనసూయ దిగిన ఒక ఫొటో చాలా సెక్సీగా ఉంది. అసలు ఈ భంగిమే అదిరిపోయింది. ఇక ఈ ఫొటోలకు ట్విట్టర్‌లో వస్తోన్న కామెంట్ల అయితే అద్భుతం. ట్విట్టర్ యూజర్లు తమ క్రియేటివిటీ మొత్తం వాడేస్తున్నారు. ఆ కామెంట్లలో కొన్ని మీకోసం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/316yDIz
No comments:
Post a Comment