టీవీ9 కేసులో సినీ నటుడు శివాజీని సైబరాబాద్ పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. అక్కడి నుంచి సైబరాబాద్ పోలీసులు తమ అదుపులోకి తీసుకుని సైబర్ క్రైమ్స్ ఆఫీస్‌కు తరలించారు. రెండునెలల క్రితమే శివాజీతో పాటు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పైనా లుకవుట్ నోటీసులు జారీ చేశారు. టీవీ9 వివాదంలో అలంద మీడియా గతంలోనే శివాజీపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. అలంద మీడియాను ఇబ్బంది పెట్టే విధంగా టీవీ9 షేర్లను తన పేరు మీదికి బదలాయించుకుని ఉద్దేశపూర్వకంగా కుట్ర చేశారనేది శివాజీపై ప్రధాన ఆరోపణ. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి టీవీ9కు చెందిన షేర్లను రవిప్రకాశ్ నుంచి కొనుగోలు చేసినట్టుగా అలంద మీడియా ఆరోపిస్తోంది. ఇదే క్రమంలో వీరిద్దరిపైనా లుకవుట్ నోటీసులు జారీ చేశారు. అంతేగాక శివాజీ నివాసంలోనూ పోలీసులు సోదాలుు నిర్వహించారు. సీఆర్పీసీ 41 ప్రకారం ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసినప్పటికీ శివాజీ పోలీసుల ముందు విచారణకు హాజరు కాలేదు. రెండునెలల అజ్నాతంలోనే ఉన్నారు. ఇదే కేసుల ఆరోపణలు ఎదుర్కున్న రవిప్రకాశ్ మాత్రం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు డైరెక్షన్‌లో ఆ బెయిల్ పిటిషన్ హైకోర్టుకు చేరింది. ప్రస్తుతం హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉంది. అంతేగాక రవిప్రకాశ్ సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు కూడా హాజరయ్యారు. కానీ, శివాజీ మాత్రం అజ్నాతంలోనే ఉండి కనీసం విచారణకు కూడా హాజరుకాలేదు. దీంతో శివాజీ కదలికలపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా ఉంచారు. అతని కోసం విజయవాడలో కూడా గాలించారు. అయితే ఎక్కడా దొరక్కుండా తప్పించుకుని తిరుగుతూ ఇటీవలే హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులని, వాటిని వెంటనే కొట్టేయాలని ఆయన కోర్టును కోరారు. దీంతో శివాజీని అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలోనే విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్న శివాజీని బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన్ని అరెస్ట్ చేయబోమని పోలీసులు అంటున్నారు. పారిపోతుంటే పట్టుకున్నామని, సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులు ఇస్తామంటున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JjlODq
No comments:
Post a Comment