Tuesday, 1 June 2021

Nikhil Siddharth: 18 పేజెస్ ఫస్ట్ లుక్.. సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్న డిఫరెంట్ పోస్టర్

'కుమారి 21F' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో యంగ్ హీరో హీరోగా రూపొందుతున్న సినిమా ''. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిఖిల్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేస్తున్న చిత్రయూనిట్.. నేడు (జూన్ 1) నిఖిల్ పుటిన రోజు కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. చిత్రయూనిట్ తరఫున నిఖిల్‌కు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో సిద్ధు పాత్రలో నిఖిల్ సిద్ధార్థ్.. నందిని పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించబోతున్నారని తెలిపారు. నిఖిల్ కళ్ళకు కాగితపు గంతలు కట్టి దానిపై అనుపమ పరమేశ్వరన్ పెన్నుతో రాస్తున్నట్లు చాలా డిఫరెంట్‌గా ఈ పోస్టర్ ఉండటంతో ప్రేక్షకులు అట్రాక్ట్ అవుతున్నారు. ''నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది'' అని ఆ పేపర్‌పై రాసి ఉండటం సినిమా పట్ల ఆసక్తి పెంచేసింది. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3c4hoiP

No comments:

Post a Comment

'Don't Compel Us To Study Hindi!'

'We are not opposed to any Indian language. We are against Hindi imposition.' from rediff Top Interviews https://ift.tt/m1ozKQM